భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవితపై విజయ్ గుట్టే దర్శకత్వంలో అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న “ది యాక్షిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ ” చిత్రం షూటింగ్ ఈ రోజుతో పూర్తి అయ్యింది . ఈ విషయాన్ని అనుపమ్ ఖేర్ స్వయంగా ఈరోజు ప్రకటించాడు .
సోనియా గాంధీ చేతిలో మన్మోహన్ సింగ్ ఎలా బొమ్మలా ఆడాడో ఈ చిత్రంలో చూపించబోతున్నారు . కాంగ్రెస్ పార్టీ భారత రాజకీయాలను ఎలా ప్రభావితం చేసిందో , ప్రధానిగా మన్మోహన్ పాత్ర ఏమిటో ఈ సంచలన రాజకీయ చిత్రంలో చూపించే అవకాశం వుంది . ఇప్పటికే ఈ చిత్రంలో నటించే ప్రధాన పాత్రలతో కూడిన గ్రూప్ ఫోటో విడుదల చేశారు .
రాజకీయంగా ఈ చిత్రం ప్రకంపనలు సృష్టించే అవకాశం వుంది ఈ చిత్రంలో మన్మోహన్ పాత్రలో సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ నటిస్తున్నాడు . మిగతా పాత్రల్లో అక్షయ్ ఖన్నా , సుజానే బెర్నెర్ట్ ,అహనా కుమార మొదలైన వారు నటిస్తున్నారు . ఈ చిత్రాన్ని బొహ్ర బ్రదర్స్ నిర్మిస్తున్నారు .
జర్మన్ నటి సుజానే బెర్నెర్ట్ సోనియా గాంధీ పాత్రలో నటిస్తుంది . ప్రియాంక గాంధీగా అహనా కుమార , అర్జున్ మాథుర్ రాహుల్ గాంధీగా నటిస్తున్నారు . ఇక “ది యాక్షిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ ” చిత్రాన్ని క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 21 న ప్రపంచమంతా విడుదల చెయ్యబోతున్నారు .