అలియాభట్ పెళ్లి వార్త‌ల‌ని ఖండించిన నిర్మాత‌ !

ర‌ణ్‌భీర్ క‌పూర్,అలియా భ‌ట్ ప్రేమాయ‌ణంలో ఉన్న సంగ‌తి తెలిసిందే. అతి త్వ‌ర‌లో వీరి వివాహం జ‌ర‌గ‌నుంద‌ని కొద్ది రోజులుగా అనేక వార్త‌లు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. రీసెంట్‌గా వీరి పెళ్లికి సంబంధించిన ఓ వార్త అంద‌రిని షాక్‌కి గురి చేసింది. వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో అలియా, ర‌ణ్‌భీర్ పెళ్ళి పీట‌లెక్క‌నున్నార‌ని, ఇందుకు సంబంధించి షాపింగ్ కూడా చేస్తున్నార‌ని అన్నారు. అలియా భ‌ట్ కోసం ప్రముఖ డిజైనర్‌ సవ్యసాచి ముఖర్జీ ప్ర‌త్యేక‌ పెళ్లి లెహెంగా కూడా డిజైన్ చేస్తున్నార‌ని చెప్పుకొచ్చారు.

ఈ పెళ్లి వదంతులపై ఆలియా బాబాయి, ప్రముఖ నిర్మాత ముకేష్‌ భట్‌ స్పందించారు. సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న వార్త‌ల‌న్నీ అబద్ధమే. ఇలాంటి వదంతుల్ని ఎవరు సృష్టించి, ప్రచారం చేస్తున్నారు?’ అని ప్రశ్నించారు.అలియా ప్ర‌స్తుతం స‌డ‌క్ 2 చిత్ర షూటింగ్ నిమిత్తం ఊటీలో ఉంది. తెలుగులో ఆర్.ఆర్.ఆర్ అనే చిత్రంలోను న‌టిస్తుంది అలియా. బ్ర‌హ్మాస్త్రా అనే చిత్రంలో రణ్‌భీర్, అలియా క‌లిసి న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.