బాలీవుడ్ మూవీ షూటింగ్ పూర్తి చేసిన నాగార్జున‌.. పిక్స్ వైర‌ల్

టాలీవుడ్ మ‌న్మ‌థుడిగా అమ్మాయిల మ‌న‌సులు దోచుకున్న కింగ్ నాగార్జున ఇప్ప‌టికీ న‌టుడిగాను, హోస్ట్‌గాను అద‌రగొడుతున్నాడు. తెలుగులో బిగ్ బాస్ సీజ‌న్ 3, సీజ‌న్ 4 కార్య‌క్ర‌మాల‌ను హోస్ట్ చేసిన నాగార్జున కొద్ది రోజులుగా వైల్డ్ డాగ్, బ్ర‌హ్మాస్త్రా అనే సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. వైల్డ్ డాగ్ చిత్ర షూటింగ్ ఇప్ప‌టికే పూర్తి కాగా, తాజాగా బ్ర‌హ్మాస్త్రా మూవీ షూటింగ్ కూడా పూర్తి చేశాడు. ఈ విష‌యాన్ని మేక‌ర్స్ అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు.

Nag 1 | Telugu Rajyam

కెరీర్ ప్రారంభంలో హిందీ సినిమాలు చేసిన నాగార్జున కేవ‌లం గెస్ట్ అప్పియ‌రెన్స్‌తోనే అల‌రించాడు. గ‌త కొన్నేళ్లుగా బాలీవుడ్‌కు పూర్తి దూరంగా ఉన్న నాగ్ ఇప్పుడు ‘బ్రహ్మస్త్ర’తో నాగార్జున తిరిగి బాలీవుడ్ సినిమాలో నటిస్తున్నాడు. రణ్‌బీర్ కపూర్, ఆలియాభట్ ఇందులో ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తుండ‌గా, క‌ర‌ణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు భారీ యాక్షన్ థ్రిల్లర్ సినిమాగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, మౌనీ రాయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

15 ఏళ్ల త‌ర్వాత నాగార్జున న‌టిస్తున్న బాలీవుడ్ చిత్రం బ్ర‌హ్మాస్త్రా కాగా ఇందులో నాగార్జున పాత్ర‌పై చాలా ఊహాగానాలు వ‌స్తున్నాయి. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుద‌ల అవుతుందా అని ఇటు సౌత్ అటు నార్త్ ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే బ్ర‌హ్మాస్త్రా చిత్రాన్ని ప‌లు పార్ట్‌లుగా మేక‌ర్స్ విడుద‌ల చేయ‌నుండ‌గా, తాజాగా తొలి షెడ్యూల్ పూర్తైంది. ఈ సంద‌ర్బంగా రణ్‌బీర్ క‌పూర్, అలియా భ‌ట్, ద‌ర్శ‌కుడు అయాన్ ముఖ‌ర్జీ క‌లిసి ఫొటోల‌కు ఫోజులిచ్చారు. ప్ర‌స్తుతం ఈ ఫొటోలు సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే నాగార్జున త్వ‌ర‌లో బంగార్రాజు అనే సినిమాతో పాటు బిగ్ బాస్ సీజ‌న్ 5 షోను హోస్ట్ చేయ‌నున్నాడు.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles