ఇన్సైడ్ టాక్ : “ఆదిపురుష్” టీజర్ లో ప్రభాస్ కి పవన్ విలన్ వాయిస్ అట.!

ఈరోజు పాన్ ఇండియా సినిమా దగ్గర ఓ బిగ్ డే అని చెప్పాలి. ఎంతో కాలంగా పాన్ ఇండియా ఆడియెన్స్ చాలా ఎగ్జైటెడ్ గా ఉన్న చిత్రం “ఆదిపురుష్”. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ హీరోయిన్ గా దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమా ఇది.

మరి రీసెంట్ గానే వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ సెన్సేషనల్ రెస్పాన్స్ ని కూడా అందుకున్నాయి. ఇక ఫైనల్ గా అయితే ఈరోజు సినిమా టీజర్ ని అయోధ్యలో ఎంతో గ్రాండ్ ఈవెంట్ తో ప్లాన్ చేసి రిలీజ్ చేస్తుండగా ఇప్పుడు ఈ టీజర్ పై బాలీవుడ్ వర్గాల నుంచి ఇన్సైడ్ టాక్ ఒకటి బయటకి వచ్చింది.

ఈ రోజు వచ్చే టీజర్ లో అయితే ప్రభాస్ కి పవన్ విలన్ నే వాయిస్ ఇస్తాడట. అయితే ఇది తెలుగులో కాదు హిందీ భాషలో మాత్రమే. పవన్ తో సర్ధార్ గబ్బర్ సింగ్ లో కనిపించిన నటుడు శరద్ కేల్కర్ బాహుబలి వెర్షన్ కి గాను ప్రభాస్ కి తాను డబ్బింగ్ చెప్పాడు.

మళ్ళీ ఇప్పుడు ఫైనల్ గా ఆదిపురుష్ చెప్పినట్టుగా సినీ వర్గాలు కన్ఫర్మ్ చేసాయి. అంతే కాకుండా ఈరోజు టీజర్ లో కూడా తన వాయిస్ తోనే డబ్బింగ్ ఉంటుంది అట. ఇక ఈ భారీ సినిమా టీజర్ కోసం అంతా ఇప్పుడు ఎదురు చూస్తున్నారు. మెయిన్ గా విజువల్స్, ప్రభాస్ కంప్లీట్ లుక్ కోసం చూస్తున్నారు.