మొన్నీమధ్య అడవి శేషు చిత్రం ‘గూఢచారి’ లో నటించిన శోభిత ధూళిపాళ గుర్తుందా. ఆ సినమా హిట్ అయినా ఆమెకు ఆఫర్స్ అయితే రాలేదు. అయితే మోడల్ గా ఆమె మళ్లీ బిజీ అవుతోంది. ఆమె ఇండియాలోని టాప్ మోడల్స్ కు టఫ్ కాంపిటేషన్ ఇవ్వటానికి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూంటుంది. అంతెందుకు ఈ ఫొటో చూస్తే మీరే ఆ మాట అంటారు. ఈ క్లీవేజ్ చూసి పడిపోని కుర్రకారు ఉంటారా అనిపిస్తోంది కదూ.
ఇక 2013లో మిస్ ఎర్త్ ఇండియా టైటిల్ గెలుచుకున్న ఈమె అనురాగ్ కశ్యప్ మూవీ రమణ్ రాఘవ్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. “రామణ్ రాఘవ్ 2.0″లో పోలీస్ ఆఫీసర్ గర్ల్ ఫ్రెండ్ గా ప్రశంసార్హమైన నటన ప్రదర్శించింది. కాకపోతే అది హీరో సెంట్రిక్ మూవీ కావడంతో ఆమెకు అనుకున్నంత గుర్తింపు రాలేదు.
అలాగే ఈ అమ్మడికి అప్పట్లో ప్రభాస్ సరసన ఆఫర్ వచ్చినప్పటికీ.. పారితోషికం విషయంలో తలెత్తిన సమస్యల కారణంగా ఆ ప్రొజెక్ట్ ను వదులుకొందని చెప్పుకొంటుంటారు. గూఢచారి చిత్రంతోనే తెలుగులో లాంచ్ అయ్యిందీ తెలుగు పిల్ల.
అవును ఆమె మన తెలుగమ్మాయే.. తెనాలికి చెందిన శోబిత ధూళిపాళ …పెరిగింది, చదువుకుంది మొత్తం వైజాగ్ లోనే. టీనేజ్ వయసు నుంచే మోడలింగ్ మీద విపరీతమైన ఆసక్తి పెంచుకున్న శోబిత తాను కోరుకుంటున్నట్టు గానే మోడలింగ్ నుంచి సినిమాల వైపు మెల్లిగా అడుగులు వేస్తోంది. కెరీర్ వైజ్ గా చూస్తే .. ఎక్స్ పోజింగ్ కు ప్రత్యేకించి పరిధులు ఏవీ పెట్టకపోవడంతో.. తెలుగులోకంటే బాలీవుడ్ లోనే కొనసాగే అవకాశాలున్నాయని అనిపిస్తోంది!