గణేష్ ఆచార్య.. బాలీవుడ్‌లో టాప్ డ్యాన్స్ మాస్టర్. ఐదు వందల పైచిలుకు సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. ఇప్పటికీ డ్యాన్స్ మాస్టర్‌గా టాప్ పొజీషన్‌లో వున్నారు. అలాంటి వ్యక్తిపై తాజాగా మీటూ ఆరోపణలు రావడం బాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తోంది. అతని దగ్గర డ్యాన్సర్‌గా పనిచేసే 33 ఏళ్ల మహిళ ముంబైలోని అంబోలి పోలీస్‌స్టేషన్‌లో గణేష్ ఆచార్యపై కేసఖ ఫైల్ చేయడంతో అసలు విషయం బయటికి వచ్చింది.
గత కొంత కాలంగా గణేష్ ఆచార్య తనని పోర్న్ వీడియోలు చూడమని బలవంతం చేస్తున్నాడని చెప్పడంతో బాలీవుడ్‌లో తాజా ఉదంతంపై చర్చమొదలైంది. డ్యాన్సర్ అసోసియేషన్‌లో సెక్రటరీగా వున్న గణేష్ ఆచార్యపై గతంలో ఎన్ని ఆరోపణలు వచ్చినా అవి బయటికి రాలేదట. దానికి కారణం గణేష్ ఆచార్య చేసిన బ్లాక్ మెయిల్సేనని తాజాగా వెలుగులోకి వచ్చింది. సీనియర్ కొరియోగ్రాఫర్ సరోజ్‌ఖాన్ కూడా గణేష్ ఆచార్యపై సంచలన ఆరోపణలు చేసింది. తన పేరుని వాడుకుని కొత్తగా వస్తున్న వారిని కూడా తను నాశనం చేస్తున్నాడని, వారిపై బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్నాడని ఆరోపించడంతో గణేష్ ఆచార్య చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది.