అల్లు అర్జున్ నైట్ పార్టీ వెనుక అసలు కథ

అల్లు అర్జున్ ముంబైలో నైట్ పార్టీ, ఎవరితోనంటే..

అల్లు అర్జున్ తాజాగా ముంబై వెళ్లీ ఓ నైట్ పార్టీ లో పాల్గొన్నాడు. అయితే ఆ పార్టీ ఎవరితో ఎక్కడా అని ఎంక్వైరీ చేస్తే కొన్ని ఇంట్రస్టింగ్ విషయాలు బయిటకు వచ్చాయి. ఆయన పనిగట్టుకుని మరీ వెళ్లీ పార్టీలో పాల్గొంది ..ఏ హీరోయిన్ తోనో లేక మరొకరితోనో కాదు…బాలీవుడ్ లో ఈ మధ్యనే వచ్చి హిట్టైన బాట్ల హౌస్ టీమ్ తో. తమ సినిమా సూపర్ సక్సెస్ అయ్యిన సందర్భంగా ఈ చిత్రం టీమ్ రాత్రి ఓ పార్టీని ఎరేంజ్ చేసింది. ఆ పార్టీకు గెస్ట్ గా అల్లు అర్జున్ కు స్పెషల్ ఇన్విటేషన్ వెళ్లింది.

అల్లు అర్జున్ సైతం చాలా ఉత్సాహంగా ముంబై వెళ్లి మరీ ఆ పార్టీలో పాల్గొన్నాడు. అయితే కేవలం తాగటానికో లేక వారితో కబుర్లు చెప్పటానికో బన్ని వెళ్ల లేదట. ఆ చిత్ర దర్శకుడు నిఖిల్ అద్వానితో ఓ ప్రాజెక్టు విషయమై మాట్లాడటానికి వెళ్లాడట. తనకు హిందీ శాటి లైట్ లో మంచి మార్కెట్ ఉండటంతో తెలుగు, హిందీ కలిసివచ్చేలా ఓ సినిమా చేస్తే బాగుంటుందనే అభిప్రాయానికి వచ్చారని తెలుస్తోంది. నిఖిల్ అద్వాని సైతం అల్లు అర్జున్ డాన్స్ లకు తాను ఫిదా అయ్యిపోయానని చెప్పారట. త్వరలోనే మరో మీటింగ్ ఏర్పాటు చేసుకుని ప్రాజెక్టు మెటీరియలైజ్ చేసే అవకాసం ఉందని తెలుస్తోంది.


బాలీవుడ్‌ నటుడు జాన్‌ అబ్రహం నటించిన సినిమా ‘బాట్లా హౌస్‌’. నిఖిల్‌ అడ్వాణీ దర్శకత్వం వహించారు. మృణాల్ ఠాకూర్‌ హీరోయిన్. రవి కిషన్‌, ప్రకాశ్‌రాజ్‌, సోనమ్‌ అరోరా తదితరులు కీలక పాత్రల్ని పోషించారు. 2008 సెప్టెంబరు 18న దేశ రాజధాని దిల్లీలో చోటుచేసుకున్న ‘బాట్ల హౌస్‌’ ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ ఆపరేషన్‌ వల్ల దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. కొందరు స్థానికుల్ని కూడా పోలీసులు అరెస్టు చేయాల్సి వచ్చింది.

దిల్లీ పోలీసులపై ప్రశ్నల వర్షం కురిసింది, ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక పోలీసు అధికారి సహా ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారు. బూటకపు ఎన్‌కౌంటర్‌ అయితే పోలీసు అధికారి ఎలా చనిపోతారని పోలీసు అధికారులు వివరణ ఇచ్చారు. ఈ కేసులో అధికారులు ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ నిజ సంఘటన ఆధారంగా ‘బాట్లా హౌస్‌’ సినిమాను రూపొందించారు. ఇందులో జాన్‌ అబ్రహం.. సంజీవ్‌ కుమార్‌ యాదవ్‌ అనే పోలీసు అధికారి పాత్రలో కనిపించారు. ఆగస్టు 15న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.