రజనీ కాంత్ స్టయిలే వేరు

సూపర్ స్టార్  రజనీకాంత్  67వ జనం దినోత్సవం.  1950 డిసెంబర్ 12న ఓ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన రజనీకాంత్  అసలు పేరు శివాజీ రావు  గేక్వాడ్ . వారిది పూనా . బెంగళూరు వచ్చి స్థిరపడ్డారు .ఛత్రపతి శివాజీ అంటే మహారాష్ట్ర వారికి ఆరాధన భావం . అందుకే కుమారుడికి తండ్రి రామోజీ రావు ఆపేరు పెట్టుకున్నారు . ఆయన పోలీస్ కానిస్టేబుల్ .

శివాజీ చదువు బెంగళూరులో సాగింది . అనంతరం బస్సు కండక్టర్ గా ఉద్యోగంలో చేరాడు . అయితే  అప్పటికే నాటకాల్లో నటించడం మొదలు పెట్టాడు . 1973లో చేస్తున్న వుద్యోగం వదిలిపెట్టి మద్రాస్ వెళ్లి  యాక్టింగ్ స్కూల్ లో చేరాడు . అదే ఆయన జీవితాన్ని అనూహ్యంగా  మార్చేసింది .

1975లో డైరెక్టర్ కె. బాల చందర్ “అపూర్వ రాగంగల్ ” అనే చిత్రం లో అవకాశం ఇచ్చాడు . శివాజీ రావు  రజనీకాంత్ అయ్యాడు .  ఆతరువాత రజనీ సినిమా రంగంలో తనదైన ఓ స్టైల్ ఏర్పరచుకున్నాడు . రజనీకాంత్ పేరు తెలియని వారు ఉండరంటే  అతిశయోక్తి కాదు . అత్యధిక  పారోతోషికం తీసు కోవడం మాత్రమే కాదు అత్యంత ఎక్కువ మంది అభిమానులను కలిగిన ఏకైక నటుడు రజనీకాంత్ .

2000 సంవత్సరంలో భారత ప్రభుత్వం పద్మభూషణ్  గౌరవంతో సత్కరించింది . ఇక అవార్డులు రివార్డులు లెక్కకు మించి వచ్చాయి . 2016లో భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డు  ప్రకటించింది .  రజనీకాంత్  నటించిన 2. 0 చిత్రం 500 కోట్ల రూపాయలను వాసులు చేసి చరిత్ర సృష్టించింది . 

అయితే రజనీకాంత్  ఎంత ఎదిగినా ఇప్పటికీ వొదిగి  ఉండటం ఆయన సంస్కారానికి నిదర్శనం . సూపర్ స స్టార్  గా ప్రజలతో జే జే లందుకుంటున్నా అతి సామాన్యుడిలా ఉండటం ఆయనకే చెల్లింది . షూటింగ్ లేకపోతె హిమాలయాలకు వెళ్లి నెలల తరబడి ధ్యానంలో  ఉందాం రాజనీకే   సాధ్యం .

సినిమా ప్రపంచం అంటే గ్లామర్ తో కూడిన రంగురంగుల లోకం . కానీ రజనీ ఆ గ్లామర్ మాయలో , మత్తులో ఎప్పుడు పడలేదు . జయాపజయాలకు అతీతంగా మౌనిలా బ్రతకటం రజనీ మాత్రమే చేయ గలడు . రజనీకాంత్  తో నాకు మూడు దశాబ్దాల నుంచి పరిచయం .

ఆయన హైదరాబాద్ వచ్చాడంటే  మోహన్ బాబు , డైరెక్టర్ దాసరి నారాయణ రావును కలవకుండా వెళ్ళాడు . ఆయన్ని ఎప్పుడు కలిసినా ఒక ఆత్మీయుడుగా ఉంటాడే తప్ప సినిమా హీరోలా అహం ప్రదర్శించలేదు . స్నేహానికి రజనీకాంత్ ప్రాణం ఇస్తాడు . ఒకానొక సందర్భంలో మోహన్ బాబు కోసం ‘పెదరాయుడు ” సినిమాలో నటించాడు . అప్పుడు మోహన్ బాబు కోసం నటించిన రజనీకాంత్ ఆసినిమా కోసం ఎలాంటి పారితోషికం  తీసుకోలేదని అంటారు . రజనీకాంత్ సునీహానికి ఇచ్చే విలువ అది .

 అసామాన్యంగా ఎదిగిన రజనీకాంత్ సామాన్యంగా ఉండటం ఆయన మంచితనానికి , మనిషితనానికి నిదర్శనం త్వరలో రాజకీయాల్లో అడుగు పెట్టబోతున్న రజనీకాంత్ కు ఆ రంగంలో కూడా విజయం చేకూరాలని కోరుకుందాం . 

-భగీరథ