తెలంగాణ అధికారిక క్లాసికల్ డ్యాన్స్ ఏంటో తెలుసా…

ఆంధ్రప్రదేశ్ అధికారిక నృత్యం కూచిపూడి. రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత తెలంగాణ అధికారం నృత్యం ఏమిటో ఇప్పటికి కూడా అధికారికంగా ఎవ్వరికి తెలియదు. ప్రభుత్వం కూడా ప్రకటించలేదు. అయితే తెలంగాణ ప్రభుత్వం అధికార నృత్యం కోసం చర్యలు ప్రారంభించినట్టు కళాకారుల ద్వారా తెలుస్తోంది.

కేశ్ పల్లి పద్మజారెడ్డి.. నిజామాబాద్ జిల్లాకు చెందిన నృత్యకారిణి. కూచిపూడి లో జాతీయ అవార్డును కూడా అందుకుంది. నిజామాబాద్ మాజీ ఎంపీ కేశ్ పల్లి గంగారెడ్డి కోడలు పద్మజా రెడ్డి. ఈమె 3 వేలకి పైగా నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. దాదాపు వెయ్యి మందికి పైగా నృత్యకారిణిలకు పద్మజా రెడ్డి శిక్షణ ఇచ్చారు. తెలంగాణకు కూడా ప్రత్యేక నృత్యం ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈమెకు బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. తెలంగాణ నృత్యానికి తెలంగాణ కాకతీయం అనే పేరుతో తెలంగాణ రాష్ట్రం నృత్యాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు తెలస్తోంది. పద్మజా రెడ్డి తెలుగురాజ్యం ప్రతినిధి గణపతితో మాట్లాడారు. పద్మజారెడ్డి ఏమన్నారో ఆమె మాటల్లో మీరే వినండి.

https://telugurajyam.com/wp-content/uploads/2018/08/PadmajaReddy-2018-August-13-online-audio-converter.com_.mp3?_=1

ఇప్పటికే తెలంగాణ కాకతీయంలో రెండు వందల మందికి పద్మజా రెడ్డి శిక్షణనిచ్చారు. పద్మజారెడ్డి క్లాసికల్ డాన్స్ గురించి తెలుసుకున్న ప్రధాని మోదీ అధికారిక భవనానికి పద్మజా రెడ్డిని ఆహ్వానించి తన కూచిపూడి సత్యభామ నృత్య ప్రదర్శనను తిలకించారు. కూచిపూడిలో కూడా పద్మజారెడ్డి సిద్దహస్తురాలు. బ్రహ్మాండంగా తన డాన్స్ తో అందరిని ఆకట్టుకోగలదు. తెలంగాణ అధికారిక నృత్యం కోసం పద్మజారెడ్డి తీవ్రంగా శ్రమిస్తున్నారు. మొత్తానికి పద్మజారెడ్డి కృషితో తెలంగాణకు అధికారిక నృత్యం రాబోతుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఆడబిడ్డ పద్మజారెడ్డికి ప్రజలు అభినందనలు తెలుపుతున్నారు.

 

పద్మజా రెడ్డి రుద్రమా దేవి అవతారంలో, నృత్యకారిణిగా