YSRCP: వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మంగళవారం పార్టీ కార్యాలయంలో ఎంపీపీలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ నాయకుడు చేయని సంక్షేమ యజ్ఞాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేశారు. కానీ 2024 సార్వత్రిక ఎన్నికలు మనకు ఎన్నో అనుభవాలను మిగిల్చాయని ఈయన తెలిపారు.
వైయస్సార్ సిపి అనేది అందరికీ అందుబాటులో ఉండే పార్టీ అందరి చర్చలు మేరకు మనం ఏదైనా ఒక నిర్ణయానికి వస్తాము. నలుగురు కూర్చొని తీర్మానం చేసుకొని ప్రకటించే పార్టీ మనది కాదని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్క వైఎస్ఆర్సిపి కార్యకర్తలను తిరిగి మన పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ఎందుకు మన పార్టీ ఇలా ఓడిపోయింది అనే విషయంపై పెద్ద ఎత్తున చర్చలు కూడా జరుగుతున్నాయని తెలిపారు.
మన పార్టీని లేకుండా చేయాలన్న ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గత ఆరు నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి అల్లకల్లోలం సృష్టించారో మనకు తెలిసిందే. ఈయన అధికారం చేపట్టకు ముందే రాష్ట్ర వ్యాప్తంగా విధ్వంసాలు మొదలయ్యాయి. జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేశారు. మెడికల్ కాలేజీలు స్కూల్స్ హాస్పిటల్ అన్నిటిని కూడా ప్రభుత్వ పరం చేస్తే చంద్రబాబు వచ్చి వాటిని ప్రవేట్ చేసేసారని చివరికి రోడ్లను కూడా ప్రైవేట్ వారికి అప్పజెబుతున్నారంటూ మండిపడ్డారు.
2019లో చంద్రబాబు ఓడిపోయిన తర్వాత మూడు సంవత్సరాల పాటు ఎక్కడ కనిపించలేదు కానీ మనం ఓడిపోయిన కూడా ప్రజలలోనే ఉన్నాము. ఇప్పుడు మళ్లీ శక్తిని పుంజుకోవాల్సిన అవసరం వచ్చింది. అంటూ ఈయన ఎంపీపీ లకు దిశా నిర్దేశాలు చేశారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే జన్మభూమి కమిటీలు వచ్చాయి ఇక ఈ కమిటీల ద్వారా ఎవరికి వారు దొరికినంత దోచుకోవడానికి సిద్ధమయ్యారు.
మన సంక్షేమ పథకాల వలన ప్రజల్లో కూడా చెక్కుచెదరని అభిమానం ఉంది. ప్రజల కోసం మళ్లీ మనం ముందుకు రావాల్సిన అవసరం ఉంది.ఎంపీపీలు, జడ్పీటీసీలు, పార్టీ మండలాధ్యక్షులకు ఇకనుంచి కచ్చితంగా ప్రాధాన్యత ఉంటుందనీ సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.