పాపి చిరాయువు… భువనేశ్వరికి వైసీపీ క్లారిటీ!

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన ఇప్పటికే 23 రోజులు పూర్తిచేసుకుని, 24వ రోజులోకి ఎంటరయ్యారు. ఈ సమయంలో టీడీపీ నేతలు చంద్రబాబు అరెస్ట్ అక్రమం అంటూ నిరసనలూ చేపడుతున్నారు.

చంద్రబాబు అరెస్ట్ అక్రమం అయితే… ఏసీబీ కోర్టు రిమాండ్ ఎందుకు విధించింది.. క్వాష పిటిషన్ ను హైకోర్టు ఎందుకు తిరస్కరించింది..? టీడీపీ నేతలకే తెలియాలి! వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ అరెస్ట్ అక్రమం అని వారు నినాదాలు చేస్తూ, నిరసనలు తెలుపుతున్నారు. ఇందులో భాగంగా శనివారం “మోత మోగిద్దాం” కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఇందులో భాగంగా కంచాలపై గరిటెలతో కొట్టడం, విజిల్స్ వేయడం, గంటలు మోగించడం, హార్న్స్ కొట్టడం, డప్పులు వాయించడం మొదలైన కార్యక్రమాలు చేశారు. అయితే.. ఇదంతా వారికి ఒక సంబరంగా ఉందే తప్ప… ఎవరి ఫేస్ లోనూ బాబు అరెస్టయ్యారనే బాద మాత్రం కనిపించలేదనే కామెంట్లు వైసీపీ నుంచి వెలువడ్డాయి.

ఈ సమయలో తాజాగా సోమవారం “సత్యమేవ జయతే” అని ఫ్లెక్సీలు పెట్టుకుని ఏడు గంటల నిరసన దీక్ష చేపట్టారు టీడీపీ నేతలు. ఇందులో భాగంగా ఢిల్లీలో లోకేష్ నిరసనకు కూర్చుంటే… రాజమండ్రిలో భువనేశ్వరి నిరసనకు దిగారు. ఇదే సమయంలో పేరు మార్చి మచిలీపట్నంలోని ఒక కల్యాణ మండపంలో మౌన దీక్ష చేపట్టారు పవన్.

ఈ సందర్భంగా పురందేశ్వరి ప్రసంగించారు. ఈ మేరకు ఆమె తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. “ఎప్పుడూ ప్రజలేనా? కుటుంబం కోసం సమయం కేటాయించరా? అంటూ ఒక భార్యగా చంద్రబాబు గారిని అప్పుడప్పుడూ నిలదీసేదాన్ని. కానీ ఈరోజు నేను ప్రజల మధ్యకు వచ్చి, ఆయనపై వారు చూపిస్తున్న ప్రేమ చూసాక, ఇప్పుడనిపిస్తుంది… ఆయన నా ఆయుష్షు కూడా తీసుకుని ప్రజలకు ఇంకా ఇంకా సేవచేయాలి” అని చెప్పుకొచ్చారు.

ఈ ట్వీట్ లో పేర్కొన్న మెసేజ్ పైనా, అందుకు సంబంధించిన వీడియో పైనా… వైసీపీ స్పందించింది. ఇందులో భాగంగా… “అమ్మా.. అమ్మా” అని సంభోదిస్తూనే… సెటైర్లు పేల్చింది. పాపి చిరాయువు అంటారు కాబట్టి… మీరు ఎలాంటి ఆందోళనా చెందాల్సిన అవసరం లేదు అన్నట్లుగా స్పందించింది.

“ఆయన మీ ఆయుష్షు పోసుకోవడం కాదమ్మా.. ఇప్పటి వరకూ ఎంతోమంది అమాయకుల ఉసురు పోసుకున్నారు. బషీర్ బాగ్ కాల్పుల ఘటన నుంచి గోదావరి పుష్కరాల్లో ఎన్నో ప్రాణాలను తన ఖాతాలో వేసుకున్నారు. అయినా పాపి చిరాయువు అంటారు కదా.. ఆ పాపాలకు శిక్ష అనుభవించాలి కాబట్టి చిరకాలం ఉంటారు లెండి” అంటూ వైసీపీ ట్విట్టర్లో స్పందించింది.

ఇదే సమయంలో ఆయన నిత్యం ప్రజలకోసమే బ్రతికేవారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపైనా వైసీపీ స్పందించింది. ఇందులో భాగంగా… “ఇక ఆయన ప్రజల కోసం బతకలేదమ్మా.. కేవలం మీ కుటుంబం కోసమే బతికారు. మీ రెండు శాతం షేర్ల ధర 400 కోట్లు అవడం వెనుక ఆయన కృషి ఎంతో ఉందమ్మా!” అంటూ ట్వీట్ చేసింది అధికార వైసీపీ! ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ అవుతుంది!!