తీవ్రాతి తీవ్రమైన ఆరోపణ ఇది.! నిజంగానే, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి మతం మార్చుకున్నారా.? వైఎస్ వివేకానంద రెడ్డి పేరు షేక్ మొహమ్మద్ అక్బర్‌గా మారిపోయిందా.? ఏ ఆధారాల్లేకుండా వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సొంత బాబాయ్ మీద ఈ స్థాయి విమర్శలు ఎలా చేస్తారబ్బా.? వైఎస్ వివేకానందరెడ్డి డెత్ మిస్టరీకి సంబంధించి తాజాగా సీబీఐ విచారణకు హాజరయ్యారు అవినాష్ రెడ్డి. ఈ క్రమంలో సిల్లీ క్వశ్చన్స్‌తో తన సమయం సీబీఐ అధికారులు వృధా చేశారన్నది అవినాష్ రెడ్డి ఆరోపణ. మరోపక్క, వైఎస్ వివేకా హత్య, ఆయన కుటుంబ కలహాల వల్లనే జరిగిందంటూ కోర్టుకి అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాదులు తెలిపారు.
ఈ విషయమై సీబీఐ విచారణ ముగిసిన తర్వాత మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు అవినాష్ రెడ్డి. వైఎస్ వివేకానందరెడ్డి పేరు మార్చుకున్నారనీ, ముస్లిం మహిళ ద్వారా ఓ బాబుకి తండ్రి అయ్యారనీ, రెండో పెళ్ళి కోసం మత మార్పిడి తర్వాత పేరుని షేక్ మొహమ్మద్ అక్బర్‌గా మార్చుకున్నారనీ అవినాష్ రెడ్డి చెప్పారు.
‘నా సోదరి సునీత నాపై తీవ్ర ఆరోపణలు చేసినా, కోర్టుల్లో నా మీద నిందలు మోపినా సంయమనం పాటించాను. ఇకపై ఎంత దూరమైనా వెళతాను. అన్ని విషయాలూ బయట పెడతాను..’ అని చెప్పారు అవినాష్ రెడ్డి. మరి, ఈ మొత్తం వ్యవహారంపై వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్టాండ్ ఏంటి.?
నిజానికి, వైఎస్ జగన్ అనుమతి లేకుండా అవినాష్ రెడ్డి ఈ స్థాయిలో ఆరోపణలు చేసే పరిస్థితి వుండకపోవచ్చు.