YS Jagan: వైయస్ జగన్ కార్యకర్తలకు భరోసా ఇచ్చారా అంటే అవునని తెలుస్తుంది మీరు కూడా మీపై జరుగుతున్నటువంటి అక్రమాలు అన్యాయాలను ఎదిరించడానికి రెడ్ బుక్ తెరవండి అంటూ వైఎస్ జగన్ తన కార్యకర్తలకు పిలుపు నిచ్చారని తెలుస్తోంది. ఇటీవల కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటూ స్వయంగా జగన్మోహన్ రెడ్డి తెలిపారు.
వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూటమి కార్యకర్తలను కూటమి నేతలను ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు అంటూ నారా లోకేష్ 2023 పాదయాత్రలో భాగంగా ఈయన రెడ్ బుక్ ఓపెన్ చేసి తమను వేధిస్తున్నటువంటి అధికారుల పేర్లను కార్యకర్తల పేర్లను కూడా ఈ పుస్తకంలో రాశారు .తన ప్రభుత్వం అధికారంలోకి వస్తే వీరందరికీ వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాను అంటూ లోకేష్ తెలిపారు.
ఇలా లోకేష్ చెప్పిన విధంగానే అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో తమ కార్యకర్తలను తమను వేధించిన వారందరిపై ఉక్కు పాదం మోపుతూ పెద్ద ఎత్తున అరెస్టులు చేయించారు. ఈ క్రమంలోనే వైయస్ జగన్మోహన్ రెడ్డి సైతం రెడ్ బుక్ గురించి ప్రస్తావిస్తూ వచ్చారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డిని కలిసిన ఎంతోమంది కార్యకర్తలు రెడ్ బుక్ గురించి ఆయన వద్ద ప్రస్తావించడమే కాకుండా వారు పడుతున్న ఇబ్బందుల గురించి తెలియజేయడంతో జగన్ కార్యకర్తలకు కూడా అభయం ఇచ్చారని తెలుస్తోంది.
ఎవరైతే అధికారుల పేధింపులకు గురి అవుతున్నారో వారందరూ కూడా ఒక రెడ్ బుక్ రాయమని కార్యకర్తలకు జగన్ సూచించినట్లు తెలుస్తోంది అయితే ఈయన మాత్రం మేము ఒక గుడ్ బుక్ పెడతామని ఏ కార్యకర్త అయితే మంచి పనులు చేస్తుంటారు వారి పేర్లను ఈ బుక్ లో పొందుపరిచి వారికి ప్రమోషన్లు ఇవ్వడం జరుగుతుంది అంటూ గతంలో తెలిపారు. ఇక జగన్ గుడ్ బుక్ రాస్తానని చెప్పడంతో అంబటి గ్రీన్ బుక్ రాస్తానని కూడా చెప్పారు. ఏపీలో రాజ్యాంగం బదులుగా అన్ని పార్టీలూ రెడ్ బుక్ అంటూ కొత్త పుస్తకాలు రాసుకోవడం విచిత్రంగా ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.