YS Jagan: రెడ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రానికి తూట్లు… కూటమి ప్రభుత్వంపై ఫైర్ అయిన జగన్!

YS Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా కూటమి ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని తెలిపారు. ఇక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రం తిరోగమనంలో ప్రయాణిస్తుంది అని తెలిపారు.

స్టేట్‌లో డిస్కంలు దయనీయ స్థితికి వెళ్లాయని చెప్పారు. ఏకంగా రూ.89 వేల కోట్ల నష్టాలు వచ్చాయని తెలిపారు. తమ హయాంలో డిస్కంలను నిలబెట్టే ప్రయత్నం చేశామన్నారు. ప్రస్తుతం రెడ్ బుక్ పాలనతో రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని జగన్ మండిపడ్డారు.వైసీపీ హయంలో పగటిపూటే 9 గంటల పాటు ఫ్రీ కరెంట్ ఇచ్చామని జగన్ తెలియజేశారు కానీ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఉచిత కరెంటు కూడా ఇవ్వలేకపోతుందని తెలిపారు.

తమ ప్రభుత్వ హయాంలో ప్రతి ఇంటికి సంక్షేమం అందిందని రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారని అదే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ హామీలు ఎక్కడికి వెళ్లాయని ఈయన ప్రశ్నించారు. ఎన్నికల హామీలలో భాగంగా ఇచ్చిన సూపర్ పిక్స్ ఎక్కడ అంటూ జగన్ ప్రశ్నించారు. బడ్జెట్ ద్వారా ప్రజలకు భరోసా ఇవ్వలేకపోయారని రాష్ట్రవ్యాప్తంగా స్కాం జరుగుతోందని జగన్ తెలిపారు.

రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం కోసం తమ ప్రభుత్వం ఎంతో కృషి చేసింది కాని చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత తాను పడిన కష్టాన్ని మొత్తం వృధా చేస్తున్నారు అంటూ జగన్ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా కూటమి ప్రభుత్వ తీరు గురించి అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పాలన గురించి ఇక ఎన్నికల హామీలలో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రశ్నిస్తూ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.