ఇది చెయ్యి జగన్. చరిత్ర నీ గురించి చెప్పుకుంటుంది..!

YS Jagan Mohan Reddy

ప్రపంచంలో అన్నిటికంటే కూడా విలువైనది ప్రాణం. ఈ ప్రాణంతో ఇప్పుడు ప్రైవేట్ ఆసుపత్రులు వ్యాపారం చేస్తున్నారు. కోట్లు ఖర్చు పెట్టి ఆసుపత్రులను కడుతూ…ఆ డబ్బులను ప్రజల నుండి గుంజుతున్నారు. చిన్న రోగం వచ్చినా కూడా లక్షల్లో వసూలు చేస్తున్నారు. కాస్త పెద్ద రోగమైతే కోట్లల్లో వసూలు చేస్తున్నారు. ఇప్పుడు కరోనా సమయంలో ప్రజల నుండి డబ్బులు గుంజుడానికి ప్రైవేట్ ఆసుపత్రులు సిద్ధమయ్యాయి.
YS Jagan serious instructions to district collectors
ఎందుకంటే ప్రజలు కరోనా వల్ల తీవ్రంగా భయపడుతున్నారు. ఈ భయాన్ని క్యాష్ చేసుకోవడానికి ఆసుపత్రుల యాజమాన్యం సిద్ధమైంది. కరోనాకు భయపడుతున్న ప్రజలకు హాస్పిటల్స్ ఇస్తున్న బిల్లులను చూసి ఇంకా భయపడుతున్నారు. ఇప్పటికే కరోనా సమయంలో బిల్లుల పేరుతో చేస్తున్న మోసలపై చాలామంది కేసులు వేస్తున్నారు. ప్రభుత్వం కూడా అక్రమాలకు పాల్పడుతున్న హాస్పటిల్స్ పై చర్యలు తీసుకుంటున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌ విషయానికొస్తే, వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం, కోవిడ్‌ కేర్‌ సెంటర్లను నిర్వహిస్తున్న 5 ఆసుపత్రులకు షాకిచ్చింది. అందులో రమేష్‌ హాస్పిటల్స్‌ కూడా ఒకటి. కరోనా పేరు చెప్పి బాధితుల్ని నిలువునా దోచేస్తున్నారన్నది ఆయా ఆసుపత్రులపై ఆరోపణల సారాంశం. ఈ నిర్ణయాన్ని ఎవరూ తప్పు పట్టే పరిస్థితి లేదు. కానీ, రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఆసుపత్రుల్లో ఇదే తరహా దోపిడీ కొనసాగుతోంది. ఈ దోపిడీని అరికట్టడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటే బాగుంటుందని ప్రజలు కోరుతున్నారు.

రాష్ట్రంలో ప్రైవేటు వైద్యానికి సంబంధించి ఖర్చుపై పరిమితులు విధించగలిగితే ప్రైవేట్ హాస్పిటల్స్ చేసే అక్రమాలు తగ్గే అవకాశం ఉందని పండితులు చెప్తున్నారు. ఈ నిర్ణయం కనుక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటే ఆయన చరిత్రలో నిలిచిపోతారని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. 2019 ఎన్నికల్లో చరిత్ర సృష్టించిన జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుంటే రాజకీయంగా కూడా రానున్న రోజుల్లో మళ్ళీ అడ్డంకులు ఉండవని రాజకీయ పండితులు చెప్తున్నారు. తెలంగాణ లో కూడా కరోనా వైద్యంలో అక్రమాలకు పాల్పడిన హాస్పిటల్స్ పై చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ప్రైవేట్ హాస్పిటల్స్ యొక్క అక్రమాలను అడ్డుకోవడానికి ఒక చట్టంను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.