జగన్ కి అస్సలు ఇష్టం లేదు – కోపమొస్తుంది.. కానీ కంట్రోల్ చేసుకుంటున్నారు!

ys jagan facing problems from high court because of stupidity of ysrcp leaders

2019 ఎన్నికల తరువాత ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదురు లేదు. రాజకీయంగా పార్టీని దెబ్బ కొట్టడానికి కూడా వైసీపీకి పోటీగా ఎవ్వరు లేరు. ప్రధాన ప్రతిపక్షం అయిన టీడీపీ ఎన్నికల్లో వైసీపీ కొట్టిన దెబ్బకు తన ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంది.రాజకీయంగా ఎలాంటి ఎదురులేని వైసీపీ రాష్ట్రంలో ఏ పని కూడా ప్రశాంతంగా చేయలేకపోతుంది. ఏ పని చేయాలని ప్రారంభించినా కూడా ఎక్కడ ఒక చోట ఆగిపోవలసి వస్తుంది.
YS Jagan serious instructions to district collectors
చేయాలనుకున్న ప్రతి అభివృద్ధి పని కూడా కోర్ట్ ల చుట్టూ తిరుగుతూ ఉంది. సుధాకర్ విషయంలో, కార్యాలయాలకు రంగుల విషయంలో, ఈసీ రమేష్ కుమార్ విషయంలో, ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో, మూడు రాజధానుల విషయంలో ఇలా ప్రతిసారి ఎదో ఒక విధంగా కోర్ట్ లో వైసీపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగులుతూనే ఉంది. హై కోర్ట్ ఇచ్చిన తీర్పులపై సుప్రీం కోర్ట్ కు వెళ్లినా కూడా ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తప్పడం లేదు.

కార్యాలయాలకు రంగుల విషయంలో, ఈసీ విషయంలో హై కోర్ట్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్ట్ కు వెళ్లగా, అక్కడ కూడా ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది.ఇంకా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం అయితే మార్చ్ నుండి వాయిదా పడుతూనే ఉంది. ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడింది. ఇలా ప్రతి విషయంలో ప్రభుత్వానికి కోర్ట్ ల్లో ప్రతి పక్షాల నేతలు అభివృద్ధి పథకాలను అడ్డుకుంటున్నారని, అభివృద్ధి కుంటూ పడేలా చేస్తున్నారని వైసీపీ నేతలు చెప్తున్నారు.

ఇలా ప్రతిసారి ఎదో విధంగా అడ్డంకులు వస్తుండటంతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా విసిగిపోయారని, కానీ సంయమనం పట్టిస్తున్నారని వైసీపీ నేతలు చెప్తున్నారు. అదే సమయంలో ప్రతి పక్ష నేతలు వేస్తున్న రాజకీయ ఎత్తుగడలకు సిద్ధంగా ఉండాలని వైసీపీ నేతలకు జగన్ మోహన్ రెడ్డి చెప్తున్నారు. అధికారులు కూడా కృంగిపోకుండా ఉండేలా వాళ్ళను కూడా ప్రోత్సహిస్తున్నారని, ప్రజల కోసం ఎన్ని అడ్డంకులనైనా కూడా అడ్డుకోవాలని జగన్ సూచిస్తున్నారని వైసీపీ నేతలు చెప్తున్నారు.