గతంలో పరిస్థితుల వేరు. ఇప్పుడు పరిస్థితులు వేరు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికీ, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకీ ముందు ముందు అస్సలేమాత్రం పొసగే అవకాశాలు కన్పించడంలేదు. వైఎస్ జగన్ విషయంలో కేసీయార్ అడ్వాంటేజ్ తీసేసుకున్నారు.
వైఎస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రి అయ్యాక, తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో కేసీయార్.. తెలంగాణకు ఆహ్వానించారు. గోదావరి జలాల వినియోగం విషయమై వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో మంతనాలు జరిపారు కేసీయార్. అయితే, అప్పట్లో కేసీయార్ ప్రతిపాదనల విషయంలో వైఎస్ జగన్ కొంత అనుమానం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు విషయంలో తనకు ఏపీ ముఖ్యమంత్రి నుంచి హామీ వచ్చిందంటూ కేసీయార్ చేసిన ప్రకటన తర్వాత ఈక్వేషన్స్ పూర్తిగా మారిపోయాయి. అప్పటినుంచి వైఎస్ జగన్ లైట్ తీసుకోవడం మొదలు పెట్టారు కేసీయార్‌ని.
వాస్తవానికి తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ముందస్తు ఎన్నికల దిశగా గతంలో వైఎస్ జగన్, కేసీయార్.. కొంత వ్యూహాత్మకంగా చర్చలు జరిపినట్లు ప్రచారం జరిగింది. కానీ, ముందస్తు విషయమై వైఎస్ జగన్ వెనక్కి తగ్గారు. కేంద్రంపై పోరాటం విషయంలోనూ కేసీయార్‌తో వైఎస్ జగన్ కలిసి వెళ్ళడంలేదు. ఏపీలో ప్రధాని మోడీకి ఘన స్వాగతం లభిస్తోంటే, తెలంగాణలో ఆ పరిస్థితి లేదు. వెరసి, కేసీయార్ – వైఎస్ జగన్.. పరస్పర భిన్నమైన మార్గాల్లో ప్రయాణించడం మొదలు పెట్టారు. కానీ, ఎందుకు.? ఎందుకంటే.. వైఎస్ జగన్ మీద డామినేటింగ్‌గా కేసీయార్ వ్యవహరించడం మొదలు పెట్టడం వల్లనే.