జగన్ ఓ రోల్ మోడల్ అయిపోయాడు

ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న జగన్మోహన్ రెడ్డికి అన్ని వైపుల నుండి అభినందనలు వరదలా వచ్చి పడుతున్నాయి. అందుకు రెండు మూడు అంశాలు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. తాజాగా తెలంగాణా కాంగ్రెస్ ఎంఎల్సీ, మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతూ జగన్ ఓ రోల్ మోడల్ గా నిలుస్తున్నట్లు అభినందించారు.

ఫిరాయింపులపై జగన్ తీసుకున్న నిర్ణయంతో పాటు ఎన్నికల హామీలను నెరవేర్చేందుకు తీసుకుంటున్న చొరవ కూడా జగన్ కు అభినందనలు తెచ్చిపెడుతున్నాయి. ఫిరాయింపుల విషయాన్నే జీవన్ మాట్లాడుతూ వయసులో చిన్నవాడైనా ప్రజా జీవితంలో రోల్ మోడల్ గా నిలిచారన్నారు.

ఫిరాయింపుల విషయంలో జగన్ చూసి తెలంగాణా సిఎం కెసియార్ నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయని చురకలు కూడా అంటించారు. అలాగే ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీలను కూడా జగన్ అమలు చేస్తుండటం చాలా శుభపరిణామమన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అనుకోవటం ప్రజా జీవితంలో చాలా మంచి పరిణామమన్నారు.