18 మందితో జనసేన జాబితా… వైసీపీ సన్నిహితుడికి టిక్కెట్!

కూటమిలో భాగంగా తనకు దగ్గిన 21 అసెంబ్లీ స్థానాలకు గానూ 18 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు పవన్ కల్యాణ్. ఇందులో కొన్ని కీలక స్థానాల్లో వలస నేతలకు అవకాశం ఇస్తూ.. ఇంతకాలం పార్టీ కోసం పనిచేసిన వారికి పక్కనపెట్టారనే ఆరోపణ బలంగా ఉన్నప్పటికీ.. ఇంకా 3 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

ఇదే సమయంలో… రెండు లోక్ సభ స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో భాగంగా.. కాకినాడ నుంచి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, మచిలీపట్నం నుంచి సిట్టింగ్ ఎంపీ బాలశౌరి జనసేన తరుపున బరిలోకి దిగుతున్నారు. ఈ సమయంలో పవన్ ప్రకటించిన అభ్యర్థుల్లో మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి బాలశౌరి.. వైసీపీ నుంచి వచ్చిన సంగతి తెలిసిందే.

ఇదే సమయంలో భీమవరం అభ్యర్థి పులపర్తి ఆంజనేయులు.. టీడీపీ నుంచి ఇటీవలే జనసేనలో చేరగా… అనకాపల్లి అభ్యర్థి కొణతాల రామకృష్ణకూడా కొద్ది రోజుల ముందే పార్టీలో చేరి టిక్కెట్ దక్కించుకున్నారు. తిరుపతి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి చిత్తూరులో గెలిచి ఇటీవల జనసేనలో చేరారు! అవన్నీ ఒకెత్తు అయితే… రైల్వే కోడూరు అభ్యర్థి విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అవును… తాజాగా విడుదల చేసిన 18 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో రైల్వే కోడూరుకు డాక్టర్ యనమల భాస్కర రావు పేరు ప్రకటించారు పవన్ కల్యాణ్. ఈ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి అయిన భాస్కర రావు.. వైసీపీకి అత్యంత సన్నిహితుడు, జగన్ కు హార్డ్ కోర్ ఫ్యాన్ కావడం గమనార్హం. ఈయనకు పెద్దిరెడ్డి ఫ్యామిలీతోనూ సన్నిహిత సంబంధాలున్నాయి! దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.

జనసేన అభ్యర్థుల జాబితా:

1. పిఠాపురం – పవన్ కల్యాణ్

2. నెల్లిమర్ల – లోకం మాధవి

3. అనకాపల్లి – కొణతాల రామకృష్ణ

4. కాకినాడ రూరల్ – పంతం నానాజీ

5. రాజానగరం- బత్తుల బలరామకృష్ణ

6. తెనాలి – నాదెండ్ల మనోహర్

7. నిడదవోలు – కందుల దుర్గేశ్

8. పెందుర్తి – పంచకర్ల రమేష్ బాబు

9. యలమంచిలి – సుందరపు విజయ్ కుమార్

10. పి.గన్నవరం – గిడ్డి సత్యనారాయణ

11. రాజోలు – దేవ వరప్రసాద్

12. తాడేపల్లిగూడెం – బొలిశెట్టి శ్రీనివాస్

13. భీమవరం – పులపర్తి ఆంజనేయులు

14. నరసాపురం – బొమ్మిడి నాయకర్

15. ఉంగుటూరు – పత్సమట్ల ధర్మరాజు

16. పోలవరం – చిర్రి బాలరాజు

17. తిరుపతి – ఆరణి శ్రీనివాసులు

18. రైల్వే కోడూరు – యనమల భాస్కర రావు

ఇక మిగిలిన అవనిగడ్డ, పాలకొండ, విశాఖపట్నం సౌత్ అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది!