వైసిపికి 20 ఎంపి సీట్లు..ఎన్డీటివి తాజా సంచలనం

ఒకవైపు తెలుగుదేశంపార్టీ అధికారంలోకి వచ్చేస్తోందని చంద్రబాబునాయుడు మీడియా జాకీలేస్తుంటే ఎన్టీటివి మాత్రం వైసిపికి 20 ఎంపి సీట్లు ఖాయమంటూ తాజాగా వెల్లడించిటం సంచలనంగా మారింది. పోలింగ్ మరో రెండు రోజులుండగా ఎన్డీటివి వెల్లడించిన సర్వే వివరాలు వైసిపి శ్రేణుల్లో మంచి జోష్ ను నింపుతోంది. చంద్రబాబు మీడియా సర్వే, జాతీయ మీడియా సర్వే ఒకేరోజు వెలువడటం యాధృచ్చికమే.

ఇప్పటి వరకూ ఏపి రాజకీయాలపై చాలా  జాతీయ మీడియా సంస్ధలు సర్వేలు చేశాయి. అయితే ఏ సంస్ధలో కూడా టిడిపికి కనీసపాటి సీట్లు కూడా వస్తాయని తేలలేదు. అవే సంస్ధలు వైసిపికి మాత్రం బ్రహ్మాండంగా పట్టం కట్టాయి. అత్యధికంగా వైసిపికి 23 ఎంపి సీట్లు వస్తాయని సర్వేలో తేల్చింది. అంటే సర్వేల్లో తేలిందంతా నిజమని నమ్మేందుకు లేదులేండి. కాకపోతే ఆయా పార్టీలకు కాస్త ఎంకరేజింగ్ ఉంటుంది.

మరో మూడు రోజుల్లో జరిగే పోలింగ్ లో వైసిపికే అత్యధిక సీట్లు వస్తాయనే సర్వేలో చెప్పటంతో పాటు దేశంలోని ప్రాంతీయ పార్టీల్లో వైసిపినే  మూడో అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని కూడా ఎన్డీటివి జోస్యం చెప్పటం ఆశ్చర్యంగానే ఉంది. ఎప్పుడో ఎన్టీయార్ హయాంలో టిడిపి 29 సీట్లతో  పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. దాంతో అందరి దృష్టి అప్పట్లో టిడిపిపైనే నిలిచింది. మళ్ళీ ఇపుడు ఢిల్లీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఎన్డీటివి అంచనా ప్రకారం వైసిపికి వస్తోందన్నమాట.