స్పీకర్ కోడెల మీద ఎమ్మెల్యే గోపిరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ మీద వైసిపి ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆళ్ల  రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ముస్తఫా, రక్షణనిధి, మేకా ప్రతాప్ అప్పారావు తీవ్రంగా విరుచుకుపడ్డారు.రేపటి నుంచి ఆంధ్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. ఈ రోజు వారు విలేకరులతో మాట్లాడారు. అనంతరం వారు  అసెంబ్లీ సమావేశాల మీద తమ వైఖరి తెలియ చేస్తూ స్పీకర్ కు ఒక బహిరంగ లేఖ కూడా రాశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద చర్యు లు తీసుకుంటే అసెంబ్లీ సమావేశాలకు రావడానికి తమకు అభ్యంతరం లేదని వారు చెప్పారు. వారు విలేకరులతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు: 

గోపిరెడ్డి వ్యాఖ్యలు

*స్పీకర్ కోడెల 22 కేసుల్లో ముద్దాయి, అలాంటి ముద్దాయిని స్పీకర్ కుర్చీలో కూర్చోపెట్టడం పెద్ద తప్పు

◆ టీడీపీ కార్యకర్తల సమావేశంలో కూడా స్పీకర్ పాల్గొంటున్నారు.  ఇది రాజ్యాంగ ప్రమాణాలు కాపాడటమెలా అవుతుంది.

◆ రాజ్యాంగ పదవిలో ఉండి సొంత ప్రయోజనం పొందడం తగునా, ఇది తప్పు కాదా

◆ అసెంబ్లీని టీడీపీ ఆఫీసులా మార్చేశారు, అలాంటి సమావేశాలకు మేము వెళ్ళాలా?

◆ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్న శాసనసభకు మేము వెళ్ళాలా

◆ కోడెల కుమారుడు, కుమార్తె అరాచకాలు దారుణంగా ఉంటున్నాయి.

మంగళరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి కామెంట్స్

 చంద్రబాబు నీకు, స్పీకరుకి బుద్ధి, జ్ఞానం, సిగ్గూ శరం ఉంటే వెంటనే అనర్హులుగా ప్రకటించండి

◆ చంద్రబాబు తప్పు చేసింది నువ్వు, మాపై విమర్శలా?

◆ ఇలాంటి స్పీకర్… ఆ కుర్చికే కళంకం తెచ్చాడు

◆ సీఎం ఫోటోకి పాలాభిషేకం చేసేంత హీనస్థితికి దిగజారాడు స్పీకర్  కోడెల

◆ సోమనాథ్ చటర్జీ లా ఉండాలి స్పీకర్ అంటే…22మందిని డిస్ క్వాలిఫై చెయ్, మేము అసెంబ్లీకి వస్తాం

పిన్నెళ్లి రామకృష్ణా రెడ్డి  (వైసిపి విప్) వ్యా ఖ్యలు

◆ రేపట్నుంచి జరగబోయే అసెంబ్లీకి హాజరు కావాలని స్పీకర్ విజ్ఞప్తి చేశారు… మేము స్పీకరుకి బహిరంగ లేఖ రాస్తున్నాం

◆ మా ఎమ్మెల్యేలు 23 మందిని రాజ్యాంగ విరుద్ధంగా కొనుగోలు చేసి సభ నడుపుతున్నారు

◆ ఇదే విషయం పలుమార్లు స్పీకర్ దృష్టికి తీసుకెళ్ళాం

◆ స్పీకర్ గారు ఇప్పటికైనా వారిని అనర్హులుగా ప్రకటించండి, రేపు సమావేశాలకు వస్తాం

◆ స్పీకర్ స్థానాన్ని మీరు అవమానపరుస్తున్నారు… టీడీపీ కండువా వేసుకుని ప్రచారం చేయడం దారుణం, టీడీపీ సభల్లో పాల్గొని రాజకీయ ప్రసంగాలు చేస్తున్నారు

◆ స్పీకర్ సీట్ నుంచి దిగిపోయి చంద్రబాబు కి పాలాభిషేకం చేసుకో…స్పీకర్ చేస్తున్న సిగ్గుమాలిన చర్యలు చూడలేక బహిరంగ లేఖ రాస్తున్నాం

◆ 4 గురు మంత్రులు, ఎమ్మెల్యేలని అనర్హులుగా ప్రకటించండి వెంటనే

మేకా ప్రతాప్ అప్పారావు

◆ ఇలాంటి స్పీకరుని ఎప్పుడూ చూడలేదు

◆ ఇలాంటి స్పీకర్ ఉండడం దురదృష్టకరం