చంద్రబాబు మాయలో పడిన పవన్.. వైసీపీ ఎమ్మెల్యేల తప్పులే కారణమా?

Vishaka Gharjana

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏ మాత్రం అవకాశం ఉన్నా వైసీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తారనే సంగతి తెలిసిందే. అయితే పవన్ విమర్శల గురించి వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు భారీ మొత్తంలో ఖర్చు చేస్తూ తమ పరువు తామే తీసుకుంటున్నారు. వైసీపీ అంటేనే పవన్ కళ్యాణ్ కు మరింత కోపం కలిగే విధంగా వైసీపీ నేతలు వ్యవహరిస్తూ ఉండటంతో పవన్ కళ్యాణ్ తాజాగా మంగళగిరి సభలో ఇష్టానుసారం వ్యాఖ్యలు చేశారు.

అయితే పవన్ కోపంగా ఉన్న సమయంలో చంద్రబాబు ఆయనను కలవడం చర్చనీయాంశమైంది. చంద్రబాబు పవన్ తో వైసీపీని ఓడించాలంటే టీడీపీ జనసేన పొత్తు పెట్టుకోవడమే మార్గమని వెల్లడించినట్టు తెలుస్తోంది. అయితే సీట్ల విషయంలో మాత్రం పవన్ కోరిన స్థాయిలో సీట్లు ఇవ్వడం సాధ్యం కాదని చంద్రబాబు తేల్చి చెప్పినట్టు బోగట్టా. ఉభయ గోదావరి జిల్లాలలో పవన్ ప్రధానంగా సీట్లు కోరుతున్నారని తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ చేసిన విమర్శల విషయంలో జగన్ ప్రస్తుతం సైలెంట్ గానే ఉన్నారు. మరోవైపు జనసేన టీడీపీ పొత్తు పెట్టుకుంటే తమకు నష్టమని అభ్యర్థులు భావిస్తున్నారు. పొత్తు వల్ల సీటు పోతే పోటీ చేయడానికి మరో బలమైన పార్టీ కూడా లేదు. 2024 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసే ఎమ్మెల్యేలకు సంబంధించిన జాబితా ఇప్పటికే సిద్ధమైందనే సంగతి తెలిసిందే.

వైసీపీ 2024 ఎన్నికల్లో రికార్డు స్థాయిలో సీట్లలో విజయం సాధించాలని భావిస్తోంది. 2024 ఎన్నికలు ఒక విధంగా అన్ని రాజకీయ పార్టీలకు అగ్ని పరీక్ష అనే సంగతి తెలిసిందే. టీడీపీ జనసేన పొత్తు వల్ల సీటు రాని అభ్యర్థులు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. టీడీపీ జనసేన పొత్తు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది.