మాజీ మంత్రి పేర్ని నాని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడంలేదు.! ఇది అందరికీ తెలిసిన విషయమే. మంత్రుల్లో పలువురు నియోజకవర్గాల మార్పు గురించి, అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద ఒత్తిడి తెస్తున్నారు. ‘ఒత్తిడి’ అనడం సబబు కాదేమో.! ‘మొరపెట్టుకుంటున్నారు’ అనడం సరైన మాట.!
ఇక, అసలు విషయానికొస్తే తాజాగా మరో మంత్రి, ‘నేను పోటీలో వుండలేను..’ అంటూ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వద్ద వాపోయారు. ఉమ్మడి గుంటూరు జిల్లాకి చెందిన మంత్రి ఆయన. తరచూ వివాదాల్లో వుంటుంటారు. పైగా, మహిళలకు సంబంధించిన వివాదాలు.!
నియోజకవర్గంలో ఈ విషయమై చాలా వ్యతిరేకతను సదరు మంత్రిగారు ఎదుర్కొంటున్నారు. ‘క్యారెక్టర్ బ్యాడ్’ అయిపోయిందనే విషయాన్ని ఆయన రూఢీ చేసుకున్నారట.! విపక్షాలు అంతలా తనపై బురద చల్లుతున్నాయన్నది సదరు మంత్రిగారి ఆవేదన.!
‘అబ్బే, అదేం లేదు.. ఎలాంటి ట్రోలింగుని అయినా ఎదుర్కొంటా.. విపక్షాల్ని ధీటుగా ఎదుర్కొని నిలబడతా..’ అని పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా, తెరవెనుకాల వ్యవహారాలు వేరేలా వున్నాయ్. జనంలోకి వెళితే, మహిళలు చీపుళ్ళు పట్టుకుని తరిమేస్తున్నారంటూ మీడియాలో ప్రచారం జరుగుతుండడంతో మంత్రిగారికి వచ్చే ఎన్నికల్లో గెలుపుపై అనుమానాలు పెరిగిపోయాయట.
నియోజకవర్గమైన మార్చాల్సిందిగా ఇప్పటికే దరఖాస్తు పెట్టుకున్నారన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎవరా మంత్రి.? ఏమా కథ.? అదైతే ప్రస్తుతానికి సస్పెన్స్.