Pawan Kalyan: వైకాపా పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ అంటే ఒకప్పుడు పావలా.. దత్తపుత్రుడు.. నిత్య పెళ్లి కొడుకు.. ప్యాకేజీ స్టార్ అంటూ ఎన్నో రకాల పేర్లతో పిలిచేవారు ఏ రోజు కూడా ఎవరు తనని పవన్ కళ్యాణ్ అని పేరు పెట్టి పిలిచిన వారే లేరు. వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి నుంచి మొదలుకొని మంత్రులు ఎమ్మెల్యేల వరకు కూడా పవన్ కళ్యాణ్ గురించి ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.
ఏ ఒక్క మీడియా సమావేశంలో పాల్గొన్న లేదా ఇంటర్వ్యూలలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాల్సి వస్తే ఇదేవిధంగా మాట్లాడేవారు కానీ ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ గురించి వైకాపా నేతలందరూ ఒక్కొక్కరుగా ఎంతో మర్యాదగా మాట్లాడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఎంతో అద్భుతంగా పరిపాలన కొనసాగిస్తున్నారని చంద్రబాబు నాయుడుని మించి పోతున్నారంటూ ఎంతోమంది వైకాపా నాయకులు పవన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇక జగన్ అనుకూల పత్రిక అయిన సాక్షిలో కూడా పవన్ కళ్యాణ్ గురించి ఇలాంటి పాజిటివ్ కథనాలు రాస్తున్నారు. ఇలా ఒక్కసారిగా వైకాపా ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ ను ఇంతలా పొగడ్డం వెనక వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఉంటాయని చెప్పాలి ఆయన పొగడమంటేనే వీరందరూ కూడా పొగుడుతున్నారు. ఇలా ఉన్నఫలంగా పవన్ కళ్యాణ్ పై వైకాపా నాయకులు అధినేత జగన్మోహన్ రెడ్డి ఇంత ప్రేమ చూపించడానికి కారణం ఏంటి అంటే 2029 ఎన్నికలకు జగన్ తన వైపు నుంచి అందరిని క్లియర్ చేసుకుంటూ వస్తున్నారని తెలుస్తోంది.
ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో భాగంగా ఎన్నికల బరిలో దిగారు అయితే ఇలా వీరిద్దరూ కలిసే ఉంటే ఇంకో పార్టీ వచ్చిన వీరిని ఓడించడం కష్టమని భావించిన జగన్ ఎలాగైనా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుని విడదీయాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే చంద్రబాబును మించిన పవన్ కళ్యాణ్ అంటూ కథనాలు రాస్తుంది ఇలా పవన్ కళ్యాణ్ కు ఎలివేషన్ ఇవ్వటం వల్ల పవన్ కళ్యాణ్ కు వచ్చే ఎన్నికలలో సొంతంగా పోటీ చేసే ఆలోచనలు కూడా రావచ్చు. ఇలా తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేయకుండా విడగొట్టడం కోసమే జగన్ ఇలాంటి పొగడ్తల వర్షం కురిపిస్తున్నారని స్పష్టమవుతుంది. మరి 2029 ఎన్నికలలో కూడా పవన్ చంద్రబాబు కలిసే పోటీ చేస్తారా లేకపోతే పవన్ తన స్టామినాని పెంచుకొని సింగిల్ గా ఎన్నికల బరిలో దిగుతారా అనేది తెలియాల్సి ఉంది.
