గాజువాక నుంచి పోటీ చేస్తే పవన్ కు షాక్ తప్పదా.. ఏం జరిగిందంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లు అయ్యాయి. రీమేక్ సినిమాలతో సైతం పవన్ కళ్యాణ్ విజయాలను సొంతం చేసుకున్నారు. అయితే రాజకీయాలలో మాత్రం పవన్ కళ్యాణ్ ఎంత కష్టపడుతున్నా ఆయన కోరుకున్న ఫలితాలు అయితే దక్కడం లేదనే సంగతి తెలిసిందే. 2024 ఎన్నికల్లో పవన్ ఎక్కడినుంచి పోటీ చేస్తారనే ప్రశ్నకు సైతం సమాధానం దొరకడం లేదు.

అయితే పవన్ కళ్యాణ్ ఎంత కష్టపడినా 2024 ఎన్నికల్లో కూడా ఆయనకు గెలుపు కష్టమనే కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. జనసేన అభిమానులు, కార్యకర్తలు మాత్రం పవన్ కళ్యాణ్ గాజువాక నుంచి పోటీ చేయాలని కోరుకుంటున్నారు. ఈసారి గాజువాకలో పవన్ పోటీ చేస్తే ఆయన కచ్చితంగా గెలుస్తారని అభిమానులు భావిస్తుండటం గమనార్హం. పవన్ గెలుపు కోసం తమ వంతు కృషి చేస్తామని జనసేన కార్యకర్తలు చెబుతున్నారు.

అయితే వైసీపీ నేతలు మాత్రం పవన్ కళ్యాణ్ కు భారీ షాకిచ్చేలా కామెంట్లు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇతర పార్టీలతో కలిసి గాజువాకలో పోటీ చేసినా తమకు అభ్యంతరం లేదని గాజువాకలో పవన్ గెలిచే అవకాశం లేదని కాన్ఫిడెన్స్ తో చెబుతున్నారు. గాజువాకలో వైసీపీ తరపున మళ్లీ తిప్పల కుటుంబం విజయం సాధిస్తుందని వైసీపీ నేతలు వెల్లడిస్తున్నారు.

ఏపీ సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల విషయంలో ప్రజలు సంతృప్తితో ఉన్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. గాజువాక ఎమ్మెల్యే ప్రజల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని వైసీపీ నేతల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ కు 2024 ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడాల్సి ఉంది. 2024 ఎన్నికల్లో కూడా జనసేన తరపున పోటీ చేసి పవన్ ఓడిపోతే పవన్ పొలిటికల్ కెరీర్ కు గుడ్ బై చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పవచ్చు.