YS Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా రేషన్ బియ్యం అక్రమ రవాణా పై స్పందించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. గత కొద్దిరోజులుగా ఏపీలో పెద్ద ఎత్తున ఆక్రమ బియ్యం రవాణా జరుగుతున్నాయని కాకినాడ పోర్ట్ ఆధారంగా ఈ బియ్యం రవాణా జరుగుతోందని తెలిపారు అయితే ఇలాంటి వార్తలు బయటకు రావడం స్వయంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టుకు వెళ్లి మరి సీజ్ ది షిప్ అంటూ ఆదేశాలను జారీ చేసిన విషయం మనకు తెలిసిందే.
ఇక ఈ విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలోనే వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భాగంగా ఈయన అక్రమ రవాణాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రేషన్ బియ్యం ఎగుమతి జరుగుతుంది అంటే బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్నది వాళ్లే కేంద్రంలో అధికారంలో ఉన్నది కూడా వాళ్లే ఇక చెక్ పోస్టుల వద్ద,పోర్టులో కస్టమ్స్ వాళ్లు, భద్రతా సిబ్బంది వాళ్లే, మంత్రులు వాళ్లే అధికారులు వాళ్లే మరి రేషన్ బియ్యం అక్రమంగా రవాణా జరుగుతుంది అంటే ఆ రవాణా చేస్తున్నది కూడా స్వయంగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వియ్యంకుడు బియ్యాన్ని ఎగుమతిచేస్తున్నారు.. కానీ, ఆ షిప్ దగ్గరకు మాత్రం వెళ్లలేదు అంటూ సంచలన ఆరోపణలు చేశారు..
ఇక, బియ్యం ఎగుమతిలో ఏపీ దేశంలోనే నంబర్ వన్ అని పేర్కొన్నారు వైఎస్ జగన్.. దశాబ్దాలుగా బియ్యం ఎగుమతులు ఇక్కడ నుంచే జరుగుతున్నాయి. పయ్యావుల వియ్యంకుడు బియ్యం ఎగుమతుల్లో నంబర్ వన్‌గా ఉన్నాడన్నారు.. తమ ప్రభుత్వ హయాంలో ఇలాంటి అవకతవకలు జరగకుండా స్వయంగా ఇంటింటికి వెళ్లి మరి బియ్యం పంపిణీ చేస్తూ రేషన్ బియ్యం దుర్వినియోగానికి పుల్‌స్టాప్ పెట్టింది. మన హయామంలో స్వర్ణ రకం తినగలిగే బియ్యాన్ని అందించాం..
ప్రస్తుత ప్రభుత్వం మాత్రం అన్ని పద్దతులూ మార్చారు. మళ్లీ డీలర్లకు అన్ని అప్పగించారని ఆరోపించారు.. సార్టెక్స్ బియ్యాన్ని ఇవ్వడం లేదు.. ప్రజలకు నాసిరకం బియ్యం సరఫరా చేస్తున్నారు. ప్రజలకు సరిగ్గా బియ్యం ఇవ్వడంలేదు. దీనివల్ల మళ్లీ రేషన్ మాఫియా వచ్చింది. ఎమ్మెల్యేలకూ కమీషన్లు వెళ్లే పరిస్థితి ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇలా రేషన్ బియ్యం అక్రమ రవాణా పై వైఎస్ జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.