ఏపీ ప్రతిపక్షనేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న వైసీపీ అభిమానులు జగన్ బర్త్ డేను ఘనంగా జరుపుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశా, విదేశాలలో ఉన్న వైఎస్ఆర్‌సీపీ అభిమానులు జగన్ 47వ పుట్టిన రోజు వేడుకలు పండుగలా చేసుకున్నారు.జగన్ కూడా పాదయాత్రలో అభిమానుల మధ్యే కేక్ కట్ చేసి పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు.
వైస్సార్సీపీ మలేషియాలో వింగ్ ఆధ్వర్యంలో వైస్సార్సీపీ అధ్యక్షుడు వై ఎస్ జగన్ జన్మదిన వేడుకుల ఘనంగా నిర్వహించారు. జై జగన్ నినాదాలతో కన్వెన్షన్ హాల్ చేరుకున్న వైస్సార్సీపీ అభిమానులు కేక్ కట్ చేసి పంచిపెట్టారు.
ఈ సందర్భంగా కన్వీనర్ విజయ భాస్కర్ రెడ్డి మాట్లడుతూ జగన్ గత తొమ్మిది సంవత్సరాలుగా ప్రజల తరఫున చేస్తున్న పోరాటాలు అలాగా ప్రభుత్వం విస్మరించిన హామీలు వివరించారు. అలాగే జగన్ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఆ దిశగా తామంతా తమకు చేతనైన రీతిలో పార్టీకి సేవలందించాలని కోరారు.
మలేషియా ఎన్ఆర్ఐ మరో కన్వీనర్ శ్రీరామ్ బొలిశెట్టి మాట్లాడుతు…. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను నేరవేర్చే నాయకుడు ఒక్క జగనే అని ఆయన తెలిపారు. సంక్షేమ పథకాలు మళ్లీ అమలు కావలంటే జగన్ సీఎంను చేసుకునే బాధ్యత మన అందరిపై ఉందని అభిప్రాయపడ్డారు. 2019లోజరగబోయే ఎన్నికలలో జగన్‌కు మన వంతు తోడ్పాటు అందచేయలని ఆయన కోరారు. కొత్త రాష్ట్రం ఏపీ అభివృద్ది చెందాలంటే జగన్‌ను సీఎంను చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని ఈ సందర్భంగా శ్రీరామ్ బొలిశెట్టి తెలిపారు.
ఈ కార్యక్రమంలో మలేషియా వైసీపీ కన్వీనర్‌లు లేబాకు విజయ్‌భాస్కర్ రెడ్డి , కిరణ్ సత్తిరాజు, గోపాల్ సత్తిరాజు, శ్రీరామ్ బొలిశెట్టి, మహేష్ కనమల, సుందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అవినాష్, విష్ణువర్థన్‌రెడ్డి, హర్షవర్థన్, రాంబాబు, శ్రీనివాసులరెడ్డి, రామకృష్ణారెడ్డి, జయపాల్ రెడ్డి, వాసు, సాంబా, నారాయణ, గణేష్, నాగిరెడ్డి, వీరా రెడ్డి సురవరం, సురక్షిత్ కుమార్ రెడ్డి అకేపాటి, రామరావు పెనిగలపాటి.. జగన్ బర్త్‌డే వేడుకల్లోపాల్గొని కారు ర్యాలీ నిర్వహించారు.