ఒకే వేదికపై జూనియర్ ఎన్టీఆర్ , బాలకృష్ణ

తెలంగాణ రాష్ట్రంలో జరగబోతున్న ఎన్నికలు క్రమంగా వేడెక్కుతున్నాయి. టీఆరెస్ ను ఎలాగైనా ఓడించాలని కాంగ్రెస్ పార్టీ, తెలుగు దేశం, తెలంగాణ జన సమితి , సిపిఐ మహాకూటమిగా ఏర్పడ్డాయి . కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తమ పార్టీని తెలంగాణాలో ఎలాగైనా గెలిపించుకోవాలని తగిన ప్రణాళిక రచిస్తున్నారట.  ఇందుకు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్ర  బాబు కూడా ఆర్ధికంగా, హార్దికంగా సహాయ పడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

తెలంగా పార్టీ నాయకులతో  తెలుగు దేశం శాసన సభ్యుడు, హీరో బాలకృష్ణ టచ్ లో వుంటున్నాడు. తెలుగు దేశం తెలంగాణ పార్టీ నాయకులూ కూడా తరచుగా బాలయ్యను కలసి కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ పనుల్లో తీరిక లేకుండా ఉంటున్నాడు. అయినా ఎక్కడ షూటింగ్ జరుగుతుంటే అక్కడికే ఈ నాయకులు హాజరవుతున్నారు.

బాలకృష్ణ హైద్రాబాద్లో ఉంటాడు కాబాబట్టి ఆయన్ని కలవమని చంద్ర బాబే చెప్పాడట. కాంగ్రెస్ తో కలసి కొన్ని చోట్ల ప్రచారం చెయ్యాలని నిర్ణయించుకున్నారని, ఈ వేదికలపై రాహుల్ గాంధీ ,విజయ శాంతి తో పాటు బాలకృష్ణ కూడా వుండే విధంగా ప్లాన్ చేస్తున్నారట. హరికృష్ణ మరణించిన తరువాత  జూనియర్ ఎన్టీఆర్  చంద్ర బాబు, బాలకృష్ణకు బాగా చేరువయ్యారని, బాలకృష్ణ కూడా గతం  మర్చిపోయి జూనియర్ ఎన్టీఆర్ తో ఆప్యాయంగా మాట్లాడుతున్నారట.

తండ్రి లేకపోవడంతో జూనియర్ ఈ ఇద్దరి తో కలసి సాగాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది.  దీనిని దృష్టిలో పెట్టుకొని అటు చంద్ర బాబు,
ఇటు బాలకృష్ణ  కూడా జూనియర్ ను తెలంగాణ ఎన్నికల ప్రచారంలో దించాలని ఆలోచిస్తున్నారట. ఈ విషయం జూనియరుతో ప్రస్తావించినప్పుడు “మీరు ఎలా చెబితే ఇలాగే చేస్తానని ” చెప్పినట్టు తెలిసింది.

అందుకే జూనియర్ నటించిన “అరవింద సమేత  వీర రాఘవ ” సినిమా విడుదల సందర్భంగా  చంద్ర బాబు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక ఆటలు ప్రదర్శించుకోవడాని అనుమతి ఇచ్చారు. 2009 ఎన్నికల్లో   జూనియర్ ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ కోసం ప్రచారం చేశాడు. నవంబర్ మూడవ వారం తరువాత బాలకృష్ణ , జూనియర్  రంగంలోకి దూకే అవకాశం వుంది.

 
శ్రీకాకుళంలో వరదల వల్ల నష్టపోయిన కుటుంబాల సహాయార్ధం జూనియర్ ఎన్టీఆర్ 15 లక్షలు, కళ్యాణ్ రామ్ 5 లక్షలు విరాళంగా ప్రకటించారు.
ఒక్క పురందేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వర రావు మినహా నారా, నందమూరి కుటుంబ సభ్యులంతా ఏకమయ్యారట. మొత్తానికి చంద్ర బాబు అనుకున్నది సాధిస్తున్నాడు.