జగన్ కి ఇలా స్వాగతం చెబుతారని ఎవరూ ఊహించరు (వీడియో)

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర 232 వ రోజుకు చేరుకుంది. బుధవారం తూర్పుగోదావరి జిల్లా, ప్రత్తిపాడు నియోజకవర్గం గిడజంలో ఆయన పాదయాత్ర సాగింది. ఈ సందర్భముగా అక్కడి మహిళలు జగన్ నడిచే దారిలో చీరలు పరిచి ఆయనకు స్వాగతం పలికారు. జగన్ పై తమ అభిమానాన్ని ఇలా వినూత్నంగా తెలియజేశారు గిడజం మహిళలు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. కింద ఆ వీడియో ఉంది మీరు కూడా చూడవచ్చు.