పవన్ ను సీఎంగా ప్రకటించడానికి చంద్రబాబుకు ఓకేనా.. అలా చేస్తారా?

Chandrababu and Pawan Kalyan showed cowardice

2024 లో బీజేపీ టీడీపీ జనసేన కూటమి ఎన్నికల్లో పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని బీజేపీ కోరుకుంటోందని సమాచారం. చంద్రబాబు అధికారంలోకి రావడానికి ముందు ఒక విధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత మరో విధంగా వ్యవహరిస్తారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. అయితే పవన్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించడానికి చంద్రబాబుకు సమ్మతమేనా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ప్రతిపాదనకు పవన్ కళ్యాణ్ తో పాటు పవన్ అభిమానులు సైతం ఓకే చెప్పే అవకాశం అయితే ఉంది. 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు ఫిక్స్ అయిన నేపథ్యంలో ఈ ప్రతిపాదనపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ నేతలు ఈ ప్రతిపాదనకు నో చెప్పే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. చంద్రబాబు కాకుండా మరొకరిని అభ్యర్థిగా ప్రకటించడానికి టీడీపీ నేతలు ఓకే చెప్పరు.

మరోవైపు ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. వైసీపీ 2019 ఎన్నికల కంటే మరిన్ని ఎక్కువ సీట్లలో గెలవడానికి ప్రయత్నాలు చేస్తోంది. టీడీపీపై మాత్రం గతంతో పోల్చి చూస్తే కొంతమేర వ్యతిరేకత తగ్గినా పార్టీ పూర్తిస్థాయిలో పుంజుకోలేదు. వైసీపీపై ప్రజల్లో ఉన్న కొంత వ్యతిరేకతను మాత్రం టీడీపీ క్యాష్ చేసుకుంటోంది.

అభివృద్ధి విషయంలో టీడీపీ వేస్తున్న తప్పటడుగులు ఆ పార్టీకి శాపంగా మారాయి. 2024 ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చూడాల్సి ఉంది. జగన్ సైతం ప్రజల్లోకి రావడానికి ప్రాధాన్యత ఇస్తే మంచిదని చెప్పవచ్చు. ప్రజలకు దూరంగా ఉండి చేసే పాలన వల్ల జగన్ సర్కార్ పై నెగిటివిటీ పెరుగుతోంది.