ఎన్టీఆర్ ను టార్గెట్ చేసినట్టే ప్రభాస్ ను టార్గెట్ చేస్తారా.. ఆ పార్టీ నేతలు ఏమంటారో?

ఈ మధ్య కాలంలో బీజేపీ ముఖ్య నేతలు వరుసగా టాలీవుడ్ సినీ హీరోలను కలవడం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. సక్సెస్ లో ఉన్న స్టార్ హీరోలను, క్రేజ్ ఉన్న హీరోలను కలవడం ద్వారా పరోక్షంగా ఆ హీరోల మద్దతు తమకే ఉందనే విధంగా అభిప్రాయం కలిగేలా చేస్తున్నారు. ప్రముఖ రాజకీయ నేతలు కలుస్తామని చెబితే స్టార్ హీరోలు సైతం నో చెప్పే అవకాశం అయితే ఉండదనే సంగతి తెలిసిందే.

అయితే అమిత్ షా తారక్ ను కలవడం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చకు దారి తీయగా అదే సమయంలో ఎన్టీఆర్ ను ఒక రాజకీయ పార్టీ టార్గెట్ చేసింది. ఎన్టీఆర్ ఆ రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి కామెంట్లు చేయకపోయినా ఆ రాజకీయ పార్టీ మాత్రం కావాలనే తారక్ ను టార్గెట్ చేయడం జరిగింది. కృష్ణంరాజు మరణం వల్ల అమిత్ షా ప్రభాస్ ను కలవనున్నారు. కృష్ణంరాజు చనిపోయే సమయానికి బీజేపీ సభ్యునిగానే ఉన్నారనే సంగతి తెలిసిందే.

అయితే అమిత్ షా ప్రభాస్ ను కలిస్తే తారక్ ను టార్గెట్ చేసినట్టే ప్రభాస్ ను టార్గెట్ ను చేస్తారా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ ను ఆ రాజకీయ పార్టీ టార్గెట్ చేస్తే మాత్రం సామాన్య ప్రజల్లో కూడా ఆ పార్టీపై చెడు అభిప్రాయం కలిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. అమిత్ షా ప్రభాస్ ను కలవడానికి రాజకీయపరమైన కారణాలు అయితే లేవు. కేవలం పరామర్శించడానికి మాత్రమే అమిత్ షా ప్రభాస్ ను కలుస్తున్నారనే సంగతి తెలిసిందే.

తెలంగాణలోని ప్రముఖ రాజకీయ పార్టీ బీజేపీ నేతలను కలిసిన ప్రతి సినీ సెలబ్రిటీని టార్గెట్ చేస్తే రాబోయే రోజుల్లో అందరు హీరోల అభిమానులు టార్గెట్ చేసిన రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా మారే ఛాన్స్ అయితే ఉంది. సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలకు తెలంగాణలో అనుకూల వాతావరణం ఉండేలా ప్రముఖ రాజకీయ పార్టీ అడుగులు వేయకపోతే రాబోయే రోజుల్లో సినీ పరిశ్రమ ఏపీకి షిఫ్ట్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.