తప్పు చేసిన ప్రతి వ్యక్తి తాను చేసింది తప్పు అని తెలిసినా ఆ తప్పును సమర్థించుకోవాలని ప్రయత్నిస్తాడనే సంగతి తెలిసిందే. బాలయ్య హోస్ట్ గా చంద్రబాబు గెస్ట్ గా హాజరైన అన్ స్టాపబుల్ ఎపిసోడ్ ను చూస్తే తాము చేసిన తప్పులను కప్పిపుచ్చడానికి చంద్రబాబు, బాలయ్య తమ వంతు ప్రయత్నాలు చేశారని అర్థమవుతోంది. మరి సీనియర్ ఎన్టీఆర్ మరణానికి కారణమెవరు అనే ప్రశ్నకు బాలయ్య నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో చూడాల్సి ఉంది.
లక్ష్మీపార్వతి వల్లే ఎన్టీఆర్ అధికారం కోల్పోవాల్సి వచ్చిందని చంద్రబాబు చెప్పడం బాలయ్య సైతం చంద్రబాబు చెప్పిన విషయాలను సమర్థించడం గమనార్హం. అయితే ఇదే సమయంలో బాలయ్యపై వైసీపీ నుంచి వస్తున్న విమర్శలు అన్నీఇన్నీ కావు. వైసీపీ లోకేశ్ ను పప్పు అని పిలవడానికి కారణమేంటి? 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయానికి కారణమేంటి? అనే ప్రశ్నలు కూడా బాలయ్య చంద్రబాబును అడిగి ఉంటే బాగుండేది.
అమరావతినే రాజధానిగా చేయాలని చంద్రబాబు ఎందుకు అనుకున్నారు అనే ప్రశ్నలకు సైతం సమాధానం దొరకాల్సి ఉంది. వైఎస్సార్ బాలయ్యకు చేసిన సహాయం సైతం అంతాఇంతా కాదు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో బాలయ్య ఒక కేసులో చిక్కుకుంటే ఆ సమయంలో వైఎస్సార్ సహాయం చేశారనే సంగతి తెలిసిందే. అలాంటి విషయాల గురించి మాత్రం బాలయ్య, చంద్రబాబు చెప్పడానికి ఇష్టపడరు.
సీనియర్ ఎన్టీఆర్ ఆరాధ్య దైవం అని చెప్పే చంద్రబాబు ఎన్టీఆర్ కు చేసిన మోసాన్ని మాత్రం చెప్పడానికి ఇష్టపడలేదు. లక్ష్మీపార్వతి సాకుగా చూపి టీడీపీని చేజిక్కించుకున్న చంద్రబాబు ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదో చెప్పి ఉంటె బాగుండేది. నందమూరి పార్టీ అయిన టీడీపీ ప్రస్తుతం నారా పార్టీగా మిగిలిపోవడం గమనార్హం.