క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన రజనీకాంత్ ఇంకా సినిమాల మధ్యనే తిరుగుతున్నాడు . వచ్చే సంవత్సరం ఎన్నికల్లో పోటీ చేయ వచ్చునని ఊహాగానాలు వెలువడుతున్న రజని నుంచి రాజకీయాల గురించి సరైన సమాధానం రాలేదు . తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో రజని కాంత్ రాజకీయాలపై చేసిన కామెంట్స్ , ఆ తరువాత వాటిపై మాట మార్చిన తీరు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి .
భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మిగతా పార్టీలన్నీ కలసి కూటమిగా ఏర్పాటవుతున్నాయి . దీని మీద మీ అభిప్రాయం ఏమిటి ? అని జర్నలిస్టులు అడిగినప్పుడు “అది తప్పకుండా ప్రమాదమే” అని చెప్పాడు . అయితే ఆ తరువాత దానిపై మాట్లాడుతూ .”నేనింకా పూర్తి రాజకీయాల్లోకి రాలేదు . భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పడితే … అది ఆ పార్టీకి ప్రమాదమే అని నేను అనలేదు . ఒకవేళ అలాంటిది జరిగితే దాని పరిణామం ఎలావుంటుందో ప్రజలే నిర్ణయిస్తారు ” అని చెప్పాడు . రజనీకాంత్ ఎందుకు మాట మార్చినట్టు ?