టీడీపీని లాక్కునే ధైర్యం నందమూరి హీరోలకు ఉందా?

ప్రస్తుతం టీడీపీ నేతలలో చాలామంది పేరు మార్చడం వల్ల సీనియర్ ఎన్టీఆర్ పరువుప్రతిష్టలకు భంగం కలిగిందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ టీడీపీ నేతలు సీనియర్ ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచిన సమయంలో ఏం చేశారని ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.

ఇప్ప్పుడంతా నారానే ఉందని మనవళ్లూ టీడీపీని లాక్కోండి అంటూ అనిల్ కుమార్ యాదవ్ కామెంట్లు చేశారు. సీనియర్ ఎన్టీఆర్ మనవళ్లు ముందు ఈ విషయంలో పోరాడాలని ఆయన చెప్పుకొచ్చారు. ట్వీట్లు చేయడం కాదు పార్టీని లాక్కోవాలని అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. అయితే టీడీపీని లాక్కునే ధైర్యం ఎన్టీఆర్ మనవళ్లకు ఉందా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ మీదని ఆ పార్టీ కోసం తొడలుకొట్టాలని ఆయన సూచించారు.

అయితే చంద్రబాబుకు వ్యతిరేకంగా వెళ్లే ధైర్యం జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లకు ఉందా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. నందమూరి వంశాన్ని చంపేశారని నారా వంశం మాత్రమే ఇప్పుడు ఉందని అనిల్ కుమార్ యాదవ్ చేసిన కామెంట్ల గురించి జూనియర్ ఎన్టీఆర్ నోరు విప్పుతారేమో చూడాల్సి ఉంది. తారక్ రాజకీయాలకు సంబంధించి పూర్తిస్థాయిలో స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

తారక్ స్పందించకపోవడం వల్లే ఆయన రాజకీయాల విషయంలో ఎంతో కన్ఫ్యూజన్ నెలకొంది. తారక్ స్పందించి క్లారిటీ ఇస్తే మాత్రమే అయన పొలిటికల్ ప్లాన్స్ గురించి తెలిసే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం తారక్ మనసులో ఏ రాజకీయ పార్టీ ఉందనే ప్రశ్నకు సైతం సమాధానం దొరకడం లేదు. తారక్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సంచలన విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.