పవన్ కు అంత అత్యాశ పనికిరాదు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ లో అత్యాస పెరిగిపోతోంది. వచ్చే ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లాలోని మొత్తం మూడు లోక్ సభ స్ధానాలతో పాటు 19 అసెంబ్లీ నియోజకవర్గాలను జనసేననే గెలవాలట. అలా గెలిపిస్తేనే కోనసీమ జనాలకు పౌరుషం, ఆత్మగౌరవం ఉన్నట్లుగా పవన్ చెబుతున్నారు. అంటే పవన్ చెప్పినట్లుగా జనసేనను అన్నీ స్ధానాల్లోను గెలిపిస్తేనే పౌరుషం, ఆత్మగౌరవం ఉన్నట్లు గెలిపించకపోతే ఆ రెండు లేనట్లే అనుకోవాలి. అంటే జిల్లా ప్రజలకు పవన్ పెద్ద పరీక్షే పెట్టారన్నమాట. మరి పౌరుషం, ఆత్మగౌరవం గురించి జిల్లా ప్రజలు ఏమనుకుంటారో చూడాలి.

 

నిజానికి జిల్లాలో ఇప్పటికి వరకు పలానా నేత గట్టివాడు అని చెప్పుకునేందుకు ఒక్కళ్ళు కూడా లేరు. ముమ్మిడవరంలో పితాని బాలకృష్ణ అనే వైసిపి నేతను పార్టీలోకి చేర్చుకుని టిక్కెట్టిచ్చారు పవన్. అంటే జనసేన తరపున పోటీ చేయబోయే ఒక అభ్యర్ధిని మాత్రమే పవన్ ప్రకటించారు. ఎందుకంటే, పవన్ కూడా ఎక్కడి నుండి పోటీ చేసేది తేల్చుకోలేదు కాబట్టి. తూగో జిల్లాలోనే జనసేనకున్న గట్టి నేతలు పేర్లు చెప్పమంటే పవన్ కూడా పదిమంది పేర్లను చెప్పలేరు. ఇపుడున్న వాళ్ళంతా హెడ్ కౌంట్ కు మాత్రమే పనికొస్తారు. అలాంటిది జిల్లాలో ఉన్న మొత్తం 19 అసెంబ్లీ, మూడు పార్లమెంటు స్ధానాల్లో జనసేన గెలవాలని పవన్ ఆశించటం అత్యాసనే చెప్పాలి. అన్నీ నియోజకవర్గాల్లో ముందు గట్టి అభ్యర్ధులను పోటీలోకి దింపేతేనే కదా వాళ్ళు గెలిచేది లేంది తెలిసేది.

 

ఇక జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా జనాల స్పందన చూసిన తర్వాత పోయిన ఎన్నికల్లో కన్నా వచ్చే ఎన్నికల్లో మరిన్ని సీట్లు వస్తాయన్న అంచనాలో ఉన్నారు వైసిపి నేతలు. పోయిన ఎన్నికల్లో వైసిపికి ఐదు సీట్లొచ్చాయి. పోయిన ఎన్నికల్లో కన్నా వైసిపి ప్రస్తుతం బలోపతమైందనే అనిపిస్తోంది. కాబట్టి వైసిపి నేతల అంచనాల ప్రకారం అదనంగా మరిన్ని సీట్లు వస్తాయనే అనుకుంటున్నారు. ఇక, టిడిపికి  10 సీట్లు తక్కువ కాకుండా వస్తాయనే అంచనాలో ఉన్నారు ఆ నేతలు. మొత్తం మీద పై రెండు పార్టీలకు ఎన్ని సీట్లొస్తాయన్న విషయాన్ని పక్కన పెడితే  పవన్ ఖాతాలో మహా అయితే ఓ నాలుగు సీట్లొస్తే ఎక్కువనే అభిప్రాయం వినబడుతోంది. అసెంబ్లీలే నాలుగొస్తే ఇక ఎంపి సీటు గురించి ఆలోచించే ముచ్చటే అవసరం లేదు.

 

జనసేన వర్గాల ప్రకారం పవన్ ప్రధానంగా దృష్టి పెట్టింది ఉభయగోదావరి జిల్లాలు, విశాఖపట్నం నగరమట. విశాఖసిటీలో ఆరు నియోజకవర్గాలు ప్లస్ ఉభయగోదావరి జిల్లాల్లోని 34 నియోజకవర్గాలున్నాయి. అంటే ఈ 40 నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్ధులను గట్టి అభ్యర్ధులను పోటీలోకి దింపి అందులో సగం గెలిపించుకుంటే చాలా ఎక్కువ.