క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను అవే అనుమానాలు పెరిగిపోతున్నాయ్. పైగా తనకు కేంద్ర దర్యాప్తు సంస్ధల నుండి నోటీసులు అందచ్చనే భయం కూడా చంద్రబాబునాయుడులో పెరిగిపోతోంది. సరిగ్గా ఎన్నికలకు ముందు శరవేగంగా మారిపోతున్న రాజకీయ పరిణామాలతో చంద్రబాబు ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. ఓటుకునోటు కేసులో చంద్రబాబే అసలు సూత్రదారన్న విషయం అందరికీ తెలుసు. కానీ ఆ విషయం శాస్త్రీయంగా రుజువుకావాలి. అందుకే కేసులో ప్రధాన పాత్రదారుడు అప్పటి టిడిపి ఎంఎల్ఏ రేవంత్ రెడ్డిని పదే పదే ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడి) విచారణకు పిలుస్తోంది.
ఒకవైపు ఏపిలో ఎన్నికల వేడి బాగా రాజుకుంటున్న సమయంలోనే ఈడి రేవంత్ రెండు రోజుల పాటు వరుసగా రేవంత్ ను విచారించటం, తన పాత్రపై ఆరా తీసిందన్న విషయం బయటకు పొక్కగానే చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోతోంది. చేసిన తప్పు ఎప్పటికైనా బయటపడక తప్పదన్న విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే వివిధ వ్యవస్ధల్లో తనకున్న పట్టు కారణంగా ఎక్కడా ఇబ్బంది పడకుండా చంద్రబాబు ఏదోలా బండిని లాక్కొచ్చేస్తున్నారు. కానీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో జరుగుతున్న పరిణామాలు మాత్రం చంద్రబాబుకు మింగుడుపడటం లేదు.
చంద్రబాబు ఆలోచన ఏమిటంటే తానేం చేసినా ఎవరు ప్రశ్నించకూడదు. తాను చేసిన పనినే ఎదుటివారు చేస్తే మాత్రం అన్నీ వైపుల నుండి బురదచల్లేస్తారు. తప్పు చేసి పట్టుబడినా తనను ఎవరూ ముట్టుకోకూడదని చంద్రబాబు అనుకుంటుంటారు. పైగా అన్నీ రకాల తప్పులు చేస్తు, అత్యంత అవినీతికర పాలన చేస్తు కూడా తాను నిప్పునంటూ తన భుజనాన్ని తాను చరుచుకుని తిరుగటం ఒక్క చంద్రబాబుకే చెల్లింది. అందుకు చంద్రబాబుకు మద్దతుగా నిలబడుతున్న మీడియానే ప్రధాన బాధ్యత వహించక తప్పదు.
సరే ఈడి విచారణ చూస్తుంటే తొందరలోనే చంద్రబాబుకు కూడా నోటీసులిచ్చి విచారణ చేయటానికి రంగం సిద్దమవుతున్నట్లే అర్ధమవుతోంది. మరి ఆ పరిస్దితే వస్తే ఇంకేమన్నా ఉందా ? ఎన్నికలకు ముందు జరుగుతున్న పరిణామాలను కూడా తనకు అనుకూలంగా మార్చుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తారనటంలో సందేహం లేదు. అపుడు ప్రతిపక్షాలు ఎటువంటి వ్యూహాలు అనుసరిస్తాయో చూడాలి.