బాబూ, నిన్ను మళ్లీ ఎందుకెన్నుకోవాలయ్యా!!!

 జనసేన అధినేత పవన్ కల్యాణ్  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని, ఆయన కుమారుడు లోకేశ్ ను కలిపి తీవ్రంగా విమర్శించారు.

అసలు చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా మళ్లీ ఎందుకెన్నుకోవాలని ఆయన ప్రశ్నించారు.

గోదావరిజిల్లాలకు దిష్టి తగిలిందని ఆయన ప్రకటించారు.

ఈ రోజు పవన్ కల్యాణ్  పశ్చిమగోదారి జిల్లా నరసాపురానికి వచ్చారు. అక్కడ ఆయనకు అఖండ స్వాగతం లభించింది.

చిన్ననాటి తన నరసాపురం అనుభవాలను ఆయన కేరింతలు, హర్షధ్వానాల మధ్య గుర్తు చేసుకున్నారు.

‘చిన్నపుడు ఇదే నరసాపురం బస్టాండ్ దగ్గర తప్పిపోయాను.  నాకు గోదావరి జిల్లాలకు చూస్తే బాధ కలుగుతుంది, అందరూ మీకేం గోదావరి వాళ్ళు అంటారు, కాని ఇక్కడ పరిస్థితి చూస్తే బాధేస్తుంది.  చుట్టూ నీళ్లున్నా యి, కాని తాగేందుకు నీళ్ళనుకొనుక్కోవాల్సిన పరిస్థితి, గోదావరికి దిష్టి తగిలింది,’ అనిపిస్తుందని అన్నారు.

తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తీవ్రంగా దాడిచేస్తూ…

‘మిమ్మల్ని మేము ఎందుకు మళ్ళీ ముఖ్యమంత్రి గా ఎన్నుకోవాలి చంద్రబాబు గారు,’ సెలవీయండని ప్రశ్నించారు.

 ‘కనీసం మహిళలపైన దాడులు జరుగుతుంటే ఆపలేరు, నీరు ఇవ్వలేరు, రోడ్లు వేయలేరు,’ అని అన్నారు.

ముఖ్యమంత్రి నలభైయేళ్ల అనుభవాన్ని కూడా ఆయన వదల్లేదు.

 

‘‘ ఎన్టీఆర్ హయాంలో శంఖుస్థాపన చేసిన వశిష్ట బ్రిడ్జి ఇప్పటి వరకు పూర్తికాకపోవటమేనా మీ 40 ఏళ్ల అనుభవం. మనం తల్లిగా పూజించే గోదావరిలో టీడీపీ ప్రభుత్వం టన్నులకు టన్నుల చెత్తను  కలిపేశారు,’ అని పవన్ అన్నారు

ముఖ్యమంత్రి గారి అబ్బాయి తెలివితేటల మీద వ్యంగ్యాస్త్రాలు వదులుతూ… ‘ఆయనెందుకు? మా నెత్తి మీద ఎక్కి తొక్కటానికా, దోచుకోవటానికా,’ అని ప్రశ్నించారు. 

‘నేను ముఖ్యమంత్రి గారిలాగా కులాలను విభజించి రాజకీయాలు చేయను,  కులాలను కలిపే రాజకీయాలు చేస్తాను.  కాపుల రిజర్వేషన్లు విషయంలో ఇన్నిసార్లు మాటలు మార్చారు మీరు?  చేతకాని హామీలు ఎందుకిస్తున్నారని ఆయన నిలదీశారు.

‘‘ముఖ్యమంత్రి గారి ఏ పాలసీ చూసినా… కులాల మధ్య గొడవ పెట్టె రాజకీయాలే కనిపిస్తాయి.  ఏమైనా మాట్లాడితే నేను కులాన్ని నమ్ముకున్నాను అంటాడు, కులాన్ని నమ్ముకునే వాడినే ఐతే అసలు మీకు మద్దతు ఇస్తానా?’’

ముఖ్యమంత్రి ని చేయండి అని అధికార, ప్రతిపక్ష నేతలాగా ప్రాధేయపడలేనని చెబుతూ  2019లో ముఖ్యమంత్రి అయితే మీ ఇంట్లో ఒకడు ముఖ్యమంత్రి అయ్యాడు అనిపించుకునేలా అండగా ఉంటా నని  పవన్  హ మీ ఇచ్చారు.

ప్రధాని మోదీకి ఏజంటన్న విమర్శకువివరణ ఇస్తూ, ‘ప్రధాని మోడీ గారేమి నాకు బంధువు కాదు, నేను బీజేపీ కి వత్తాసు పలకడానికి నాకేమి ప్రేమ, నేను వెనుకేసుకొచ్చేది, ప్రేమించేది కష్టాల్లో ఉన్న ప్రజలను మాత్రమే,’ అని పవన్ స్పష్టం చేశారు.

పవన్ చెప్పిన మరిన్ని విశేషాలు :

*2019లో నేను ఎలా ఉద్యోగావకాశాలు కల్పిస్తాను అనేది మ్యానిఫెస్టోలో తెలియచేస్తున్నాను, జనసేన ప్రభుత్వం ఖచ్చితంగా మీకు అండగా ఉంది కొత్త పరిశ్రమలు, ఉద్యోగావకాశాలు కల్పించేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తాం.

*తెలుగుదేశం పార్టీని 30 ఏళ్ళు చూసాం, వైస్సార్సీపీ పద్ధతి చూసాం, 2019లో వాళ్ళను ఎన్నుకుంటే మనకు జరిగేది అన్యాయమే, ఇంతమంది ప్రజలకి న్యాయం చేయటానికి జనసేనకు అండగా ఉందాం

*5 సీట్లు ఇచ్చి అండగా నిలబడిన పశ్చిమగోదావరి జిల్లా ప్రజల్లో బీసీలకు ముఖ్యమంత్రిఅన్యాయం  చేసారు, కాపులకు అన్యాయం చేసారు, ఎవరికి న్యాయం చేశారు అసలు మీరు?

 

(feature image is a file picture)