ఓటమి తప్పదా ? గెలుపుపై భరోసా ఇవ్వలేదట

అవును ఈ మాట స్వయంగా జనసేన అధినేత పవన్ కల్యాణే చెప్పుకున్నారు. అయితే ఆ ఓటమి ఇపుడు పోటీ చేస్తున్న భీమవరంలోనో లేకపోతే గాజువాకలోనో కాదులేండి. పోటీ చేయాలని అనుకుని తర్వాత మానుకున్న అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో నుండి. ప్రచారంలో భాగంగా అనంతపురంలో మాట్లాడుతూ ముందు తానే అనంతపురం నుండి పోటీ చేద్దామని అనుకున్నాని చెప్పారు. కానీ తాను చేయించుకున్న సర్వేల్లో ఓడిపోతానని ఫీడ్ బ్యాక్ వచ్చిందట.

ఎప్పుడైతే ఓటమి తప్పదని సర్వేల్లో తేలిందో వెంటనే అనంతపురంలో పోటి నిర్ణయాన్ని మార్చుకున్నారట. ఆ తర్వాత మళ్ళీ సర్వే చేస్తే విశాఖపట్నం జిల్లాలోని గాజువాక, పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరంలో పోటీకి రెడీ అయిపోయారట. అనంతపురంలో గెలవనని తేలిపోగానే ఇక్కడ నుండి వరుణ్ అనే అభ్యర్ధిని పోటీలోకి దింపారట.

ఇక్కడి నుండి తాను పోటీ చేస్తే గెలిపిస్తామనే భరోసాను ఓటర్లు ఇవ్వలేదు కాబట్టే పోటీ చేయటం లేదంటున్నారు. అంటే తప్పు ఓటర్లదే అన్నమాట. నిజంగా పవన్ మాటలు వింటుంటే ఆశ్చర్యంగా ఉంది. ఎంతటి నేతైనా సరే పలానా నియోజకవర్గంలో పోటీ చేస్తే ఓడిపోతాను అని ఎక్కడా చెప్పుకోరు. పైగా పవన్ పోటీ చేసినా గెలవరు అన్న చోట ఇంకో అభ్యర్ధి ఎలా గెలుస్తారు ?

పవన్ మాటలు వింటుంటే మానసిక స్ధితిపై అందరికీ అనుమానాలు పెరుగుతున్నాయి. ఎందుకంటే, భయపడే వాళ్ళు జనసేనలో అవసరం లేదని మళ్ళీ తానే చెప్పారు. ధైర్యంలేని వాళ్ళెవరూ జనసేనలో ఉండొద్దన్నారు. భయపడే నాయకులు తనకు అవసరం లేదంటూ గట్టి గట్టిగా అరచి చెప్పారు. అసలు ఎందుకు గట్టిగా అరుస్తారో ? ఎప్పుడు ఊగిపోతారో కూడా ఎవరికీ అర్ధం కావటం లేదు. భయపడే వాళ్ళు జనసేనలో ఉండొద్దని చెప్పిన పవన్ ఓటమి భయంతోనే కదా అనంతపురంలో పోటీ చేయకుండా మానేసింది. అంటే జనసేనలో భయపడుతున్నదెవరు ?