సమీక్షలు బంద్ చేసిన చంద్రబాబు..కారణాలు తెలుసా ?

సమీక్షలను అర్ధాంతరంగా చంద్రబాబునాయుడు నిలిపేశారు. పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలను చంద్రబాబు సమీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. సరే సమీక్షలకు వచ్చే వాళ్ళు వస్తున్నారు రాని వాళ్ళు రావటం లేదు. ఇప్పటి వరకూ ఆరు పార్లమెంటు నియోజకవర్గాలను సమీక్షించారు.

చివరగా నంద్యాల, కర్నూలు పార్లమెంటు నియోజకవర్గాల సమీక్షల్లో ఎదురైన అనుభవంతో సమీక్షలను అర్ధాంతరంగా నిలిపేయాలని చంద్రబాబు నిర్ణయించటమే ఆశ్చర్యంగా ఉంది. సోమవారం జరిగిన పై రెండు నియోజకవర్గాల సమీక్షల్లో అభ్యర్దులు, నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. ఎవరి విజయానికి ఎవరు గండి కొట్టారనే విషయాలను బాహాటంగానే చెప్పేసుకున్నారు.

కర్నూలు జిల్లా నేతల వైఖరితో చంద్రబాబుకు ఒక్కసారిగా షాక్ కొట్టినట్లైంది. కర్నూలు జిల్లా నేతల సమీక్షలో ఎదురైన అనుభవాలే ఇక ముందు కూడా ఎదురైతే ఇబ్బందులు తప్పవని గ్రహించారు. ఏ జిల్లా సమీక్ష చేసినా అభ్యర్ధులు, నేతల నుండి ఆరోపణలు, విమర్శలే ఎదురవుతుండటంతో  సమీక్షలు అనవసరమని భావించారట. దాంతో సమీక్షలను అర్ధాంతరంగా రద్దు చేస్తు నిర్ణయం తీసుకున్నారు.