ముస్లింలు టిడిపికి దూరమేనా ? అందుకేనా ఫరూక్ ?

రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీకి అనుకూలంగా ముస్లిం ఓట్లు పడే విషయంలో చంద్రబాబునాయుడుకు అనుమానాలున్నట్లున్నాయ్. అందుకే జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాను పిలిపించారు. వైసిపికి అనుకూలంగా ఎంఐఏ అధినేత అసదుద్దీన్ ఓవైసి ఏపిలో ప్రచారం చేస్తానంటే ఎద్దేవా చేసిన చంద్రబాబు తానుమాత్రం ఫరూక్ ను పిలిపించుకోవటమే ఆశ్చర్యంగా ఉంది.

రాష్ట్రం మొత్తం మీద ముస్లింల ఓట్లు సుమారు 30 నియోజకవర్గాల్లో బాగానే ఉన్నాయి. అందులో కూడా కడప, గుంటూరు, కర్నూలు, పీలేరు, మదనపల్లి, ఆళ్ళగడ్డ, నంద్యాల, నెల్లూరు, అనంతపురం, హిందుపురం నియోజకవర్గాల్లో బాగా ఎక్కువున్నాయి. అందుకనే అసదుద్దీన్ వచ్చి చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. అయితే ఆ ఆఫర్ పై జగన్మోహన్ రెడ్డి పెద్దగా స్పందించలేదనుకోండి అది వేరే సంగతి.

అయితే ఇంతలోనే చంద్రబాబు మాత్రం ఫరూక్ ను పిలిపించుకుంటున్నారు. చంద్రబాబు రిక్వెస్ట్ చేస్తేనే ఫరూక్ ఏపి ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారన్న విషయం వాస్తవం. ఎందుకంటే, ఏపి గురించి ఫరూక్ ఏమీ తెలీదు కాబట్టే. ముస్లింల కోసం గుంటూరులో ‘నారా హమారా ముస్లిం హమారా’ అంటూ ఓ సమావేశం పెట్టారు గుర్తుందా ?  అంత సభ పెట్టి తమ హక్కుల కోసం నినాదాలు చేసిన ముస్లిం యువతపై ఇదే చంద్రబాబు కేసులు పెట్టించి చావగొట్టించారు.

ఇటువంటి అనేక ఘటనల వల్ల ముస్లింల్లో చంద్రబాబుపై వ్యతిరేకత పెరిగిపోయింది. రాబోయే ఎన్నికల్లో ముస్లింల ఓట్లు తనకు పడవేమో అన్న అనుమానం పెరిగిపోయినట్లుంది. అందుకే పార్టీలో ఉన్న ముస్లింలను కూడా ఎక్కడో ఉన్న ఫరూక్ ను రంగంలోకి దింపుతున్నారు. ఒక్కరోజు ఫరూక్ ప్రచారం చేసినంత మాత్రానా ముస్లింలు చంద్రబాబుకు ఓట్లేసేస్తారా ?