AP: చేత కానప్పుడు దొంగ హామీలు ఎందుకు… కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన శ్యామల!

AP: కూటమి ప్రభుత్వాన్ని వైకాపా సూపర్ సిక్స్ హామీలల్లో పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తూ వరుసగా ప్రశ్నలు వేస్తున్నారు. ఎన్నికలలో ఓటర్లను మభ్యపెడుతూ ఓటర్లతో ఆకర్షించడం కోసం కూటమి పార్టీలో సూపర్ సిక్స్ అంటూ పెద్ద ఎత్తున హామీలను ప్రకటించారు అయితే ఈ హామీలు నెరవేర్చడం సాధ్యం కాదనే విషయం వారికి కూడా తెలుసు కానీ జనాలను ఆకర్షించి ఓట్లు పొందడం కోసమే ఈ విధమైనటువంటి తప్పుడు వాగ్దానాలు చేశారు అంటూ వైకాపా నాయకులు ఇప్పటికే ఫైర్ అవుతున్న విషయం తెలిసిందే.

ఇకపోతే తాజాగా వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి శ్యామల కూటమి ప్రభుత్వం హామీలను ఏగవేత గురించి ఈమె మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా శ్యామల మాట్లాడుతూ.. ఎన్నికల హామీల పేరిట మహిళలను చాలా తేలికగా మోసం చేయచ్చని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు అదే మహిళలే తనని గద్దె దించడానికి సిద్ధంగా ఉన్నారని శ్యామల తెలిపారు.

ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా మహిళలకు ఈయన వరాలు ఇచ్చారు మరి ఇప్పుడు మహిళలకు ఇచ్చిన ఆ వరాలలో దీపం పథకం ఏమైంది ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడు అమలు చేస్తారు అంటూ వరుసగా ప్రశ్నలు వేశారు. ఎన్నికలకు ముందు చెప్పిన ఏ ఒక్క హామీని కూడా చంద్రబాబు నాయుడు నెరవేర్చలేకపోయారని మాట ఇచ్చి ప్రజలను మోసం చేశారని శ్యామల తెలిపారు.ఏరు దాటాక తెప్ప తగలేయడం బాబుకు అలవాటే. చేతగానప్పుడు, చేయలేనప్పుడు శుష్కవాగ్ధానాలు చేయకూడదు. చంద్రబాబు మహిళలకు ఎన్నో పథకాలను అమలు చేస్తామని చెప్పి అలాగే మోసం చేశారు.

సూపర్ సిక్స్ అంటూ బాండ్లను ఇస్తూ ప్రజలను నిలువెత్తున మోసం చేశారని ఈమె కూటమి నేతలపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ఈ హామీలన్నింటిని సభలు పెట్టి జనం మధ్యలో ఇస్తామని చెప్పారు మరి ఇప్పుడు ఈ హామీలను నెరవేర్చడం చేతకాలేకపోతుంది అంటూ నాలుగు గోడల మధ్య ఎందుకు చెబుతున్నారు. ఇదే మాట జనంలోకి వచ్చి చెప్పండి అంటూ శ్యామల నిడదీశారు. ప్రస్తుతం ఈమె కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన తీరు సంచలనగా మారింది.