చంద్రబాబెందుకు బయటకు రాలేకపోతున్నారు.?

వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో దిట్ట.! ఏదన్నా కేసు తన మీద నమోదవుతోందంటే, ముందస్తు బెయిల్ తెచ్చుకోగల సమర్థుడు.! ఇవన్నీ చంద్రబాబుకి వున్న ప్రత్యేకతలని తెలుగునాట రాజకీయాల్లో ప్రముఖంగా వినిపించేది ఓ వాదన.!

కానీ, అది గతం.! చంద్రబాబుకి వ్యవస్థల్ని మేనేజ్ చేయడం చేతకాదు.! ఔను, జైలు నుంచి చంద్రబాబు బయట పడలేకపోతున్నారు. ‘తనను తాను రక్షించుకోలేకపోతున్న చంద్రబాబు, తెలుగుదేశం పార్టీకి చెందిన ఇతర నేతల్ని ఎలా కాపాడగలడు.?’ అన్న ప్రశ్న టీడీపీలోనే ఉత్పన్నమవుతోంది.

అరెస్టు తాలూకు సింపతీ ఏమైనా వచ్చే ఎన్నికల్లో వర్కవుట్ అవుతుందా.? అన్న కోణంలో తప్ప, చంద్రబాబుని ఇప్పుడు ఎవరూ నమ్మలేని పరిస్థితి.

అసలు చంద్రబాబు ఎందుకు జైలు నుంచి బయటకు రాలేకపోతున్నారు.? బెయిల్ పిటిషన్ మూవ్ చేసే అవకాశం వున్నా, ‘క్వాష్’ పిటిషన్లతోనే ఎందుకు టైమ్ పాస్ చేస్తున్నట్టు.? కొన్ని కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేస్తున్నా, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి ‘బెయిల్’ జోలికి వెళ్ళడంలేదు చంద్రబాబు.

రోజులు గడుస్తున్నాయ్.. రెండు వారాలు ఇప్పటికే గడిచిపోయింది. ఇంకో రెండు వారాలు.. ఆ తర్వాత ఏమవుతుంది.? ఏమో, ఈ విషయమై టీడీపీ వర్గాల్లోనే స్పష్టత లేదు. భువనేశ్వరి రంగంలోకి దిగారు. బ్రాహ్మణి కూడా రాజకీయాలు చేస్తున్నారు. నారా లోకేష్ మాత్రం ఢిల్లీకే పరిమితమయిపోయారు.

కేసు తీవ్రత దృష్ట్యా చంద్రబాబు మేనేజిమెంట్ స్కిల్స్ పని చేయడంలేదన్నది కొందరి వాదన. అదేమీ హత్య కేసు కాదు కదా.. మేనేజ్ చేయలేకపోవడానికి.? పైగా, వెయ్యి కోట్ల స్కామ్ కూడా కాదన్నది ఇంకొందరి అభిప్రాయం.