తెలుగుదేశంపార్టీ నేతలు ఎక్కడున్నా ఇలాగే చేస్తారు. అసెంబ్లీ అనే కాదు బయట కూడా అంతే. అంతెందుకు టివి చర్చల్లో కూడా మరీ ఓవర్ గానే ప్రవర్తిస్తుంటారు. ఇదంతా ఎందుకంటే, అసెంబ్లీ సమావేశాల్లో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు వ్యవహార శైలి చాలా ఓవర్ గా ఉంది.
అచ్చెన్నాయుడు వైఖరి ఎలాగుంటుందంటే తాను మాట్లాడదలుకున్నపుడు అడగంగానే స్పీకర్ అవకాశం ఇచ్చేయాలి. వైసిపి నుండి ఎవరూ రన్నింగ్ కామెంటరీ చేయకూడదు. సభ మొత్తం తాను ఏం చెబితే అదంతా వినాల్సిందే అన్నట్లుగా ఉంటుంది. అయితే ఇతరులు మాట్లాడేటపుడు అచ్చెన్న మాత్రం నిబంధనలు పాటించరు.
ఇపుడు అసెంబ్లీలో జరుగుతున్నదదే. మంత్రులు, ఎంఎల్ఏలు మాట్లాడేటపుడు అచ్చెన్న రన్నింగ్ కామెంటరీ ఇస్తునే ఉన్నారు. చివరకు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నా సరే తన కామెంటరీని ఆపటం లేదు. అందుకే అచ్చెన్నపై జగన్ చాలా తీవ్రంగా విరుచుకుపడుతున్నారు.
అచ్చెన్న వ్యవహార శైలి ఎంతదాకా వెళ్ళిందంటే స్పీకర్ నే బెదిరించే స్ధాయికి చేరుకునింది. స్పీకర్ ను కూడా చివరకు వినండి వినండి చెప్పేది వినండి అంటూ శాసించేస్ధాయికి చేరుకున్నారు అచ్చెన్న. బహుశా అచ్చెన్న ఇంకా టిడిపినే ఇంకా అధికారంలో ఉందనుకుంటున్నారో ఏమో ?