వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు చంపారు.? ఎందుకు చంపారు.?

మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి డెత్ మిస్టరీలో రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. నారాసుర, జగనాసుర రక్త చరిత్రలు అయిపోయాయి. ఓ ’కుటుంబ క్రైమ్ కథా చిత్రమ్‘ ఇప్పుడు తెరపైకొచ్చింది. వైఎస్ వివేకానందరెడ్డికి ఆడాళ్ళంటే పిచ్చి.. అన్న అంశం తెరపైకి తీసుకొస్తున్నారు. వైఎస్ వివేకానందరెడ్డిని కామాంధుడిగా ప్రొజెక్ట్ చేస్తున్న వైనం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు కళ్ళ సిద్ధాంతంలో, ఓ కన్నుని కాపాడుకునే యత్నంలో, ఇంకో కన్నుని అత్యంత హేయంగా చూపించే ప్రయత్నం జరుగుతోందన్నది నిర్వివాదాంశం.

అసలు వైఎస్ వివేకానందరెడ్డికి రెండో పెళ్ళి అయ్యిందా.? ఆయన మతం మార్చుకున్నారా.? అన్నదానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. కానీ, ఈ దిశగా ఇప్పటికే వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. నేరుగా కోర్టుకే విషయాన్ని వివరించారాయన. తాజాగా, వైఎస్ వివేకానందరెడ్డి, ఓ వ్యక్తి తల్లిని లైంగికంగా వేధించినట్లు అభియోగాలు మోపబడుతున్నాయి.

వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడిగా వున్న ఓ వ్యక్తి తల్లి చుట్టూ కొత్త కథ షురూ అయ్యిందిప్పుడు. అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారు.? ఎందుకు చేస్తున్నారు.? వైఎస్ వివేకానందరెడ్డి రెండో పెళ్ళి అంశమే అత్యంత హేయం. ఇప్పుడేమో, ఇంకో కొత్త కట్టు కథ తెరపైకొచ్చిందాయె. వైసీపీ శ్రేణులే వాటికి అమితమైన ప్రాచుర్యమూ కల్పిస్తున్నాయ్.! ఇంతకీ వైఎస్ వివేకా ఎందుకు చనిపోయారు.? ఎవరు ఆయన్ని చంపారు.? ప్చ్.. ఇదొక మిలియన్ డాలర్ క్వశ్చన్ అయికూర్చుంది.