కొత్త సందేహం: ఎవరు సైకో – ఎవరు విజనరీ?

నాలుకకి నరం ఉండదు అంటారు. ఎందుకంటే… అది ఎలా కావాలంటే అలా తిరుగుతుంది కాబట్టి! కానీ.. అది కలిగిఉన్న మనిషికి మాత్రం మస్తిష్కం ఉంటుంది. దాన్ని ఏ మేరకు తిప్పాలి.. దాని పరిధులు ఏమిటి.. ఎంతమేరకు నిలకడగా మాట్లాడాలి వంటి పనులు మస్తిష్కం చూసుకుంటుంది. విచిత్రం ఏమిటంటే… కొంతమందికి మాత్రం మస్తిష్కానికి – నాలుకకు మధ్య ఉన్న కనెక్షన్ అప్పుడప్పుడూ డిస్కనట్ అవుతుందేమో అనే అనుమానం వస్తుంటుంది.

తాజాగా చంద్రబాబు విషయంలో కూడా అదే జరిగింది అంటున్నారు వైకాపా నేతలు!

అవును… గతంలో రెండు కళ్ల సిద్ధాంతం అంటూ.. తెలంగాణలో పార్టీని బలిచేసుకున్నారు చంద్రబాబు! అది రెండు కళ్ల సిద్ధాంతం అయితే.. తాజాగా ఏపీలో రెండు నాళ్కల సిద్ధాంతాన్నీ మొదలుపెట్టారు. ఉదయం లేచింది మొదలు… జగన్ ని సైకో సైకో అని విమర్శించే బాబు.. ఆ సైకో సూత్రాలనే ఫాలో అవుతూ రాబోయే ఎన్నికల్లో ముందుకు వెళ్లాలని ఫిక్సవుతున్నారు. జగన్ ని ఎదుర్కోవాలంటే జగన్ స్ట్రాటజీనే అప్లై చేయాలనే దయనీయమైన ఆలోచన చేశారు!

అవును… ప్ర‌తి 50 కుటుంబాల‌కు ఇద్దరిద్దరు చొప్పున గృహ సార‌థుల‌ను నియ‌మించుకున్న వైసీపీ.. వారికి శిక్ష‌ణ కార్యక్రమాలు కూడా దాదాపు పూర్తి చేసుకుంది! అనంతరం జ‌నంలోకి బలంగా వెళ్లేలా జగన్ పథకాలు రచించారు. బాబు దృష్టిలో సైకో అయిన జగన్ ఆలోచన బాబుకి తెగ నచ్చేసిందో ఏమో కానీ.. కుటుంబ సార‌థులు అని ఒక నామకరణం చేసి.. జగన్ స్ట్రాటజీని మక్కికి మక్కి దింపాలని నిర్ణయించుకున్నారు!

ఇదేదో మొదటిసారి అనుకుంటే పొరపాటే! జగన్ అధికారం చేపట్టిన కొత్తలో న్వ‌ర‌త్నాల పేరుతో తీసుకొచ్చిన సంక్షేమ ప‌థ‌కాల‌ను, స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌ను, వాలంటీర్ల‌ వ్యవస్థను నోటికొచ్చినట్లు విమర్శించిన చంద్రబాబు… కొంతకాలం తర్వాత, “తూచ్… వాటిని కొనసాగిస్తాను” అని కూడా సెలవిచ్చారు! ఇదే క్రమంలో… జగన్ ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెడితే, అంతెత్తున విమర్శలు చేసిన బాబు గారు.. తాజాగా, ఇంగ్లిష్ మీడియం తానెప్పుడో ప్రవేశపెట్టినట్లు ప్రకటించుకున్నారు!

ఈ విధంగా… ఎవరినైతే సైకో సైకో అని విమర్శిస్తున్నారో, ఆఖరికి ఆ వ్యక్తి మేధస్సునే ఫాలో అవ్వాల్సిన దుస్థితికి 40 ఇయర్స్ ఇండస్ట్రీ వ్యక్తి దిగజారిపోయారంటే… ఎవరు సైకోనో – ఎవరు అసలు సిసలు విజనరీనో ఇప్పుడు చెప్పండి అంటూ వైకాపా నాయకుకులు తమ్ముళ్లకు ప్రశ్నలు సంధిస్తున్నారు!!