టిడిపిలో అసలు భయపడుతున్నదెవరు ?

చంద్రబాబునాయుడు ఏమి చేసినా విచిత్రంగానే ఉంటుంది. మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత రివర్సు గేరులో మాట్లాడుతున్నారు. తన దగ్గరకు వస్తున్న నేతలను, శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలే విచిత్రంగా ఉంటున్నాయి. తన దగ్గరకు వస్తున్న నేతలతో ‘అందరూ ధైర్యంగా ఉండండి…ఎవ్వరూ అధైర్యపడొద్దు’ అంటూ పదే పదే చెబుతూ ఓదార్చుతున్నారు.

ఎన్నికల్లో ఓటమి తర్వాత అధైర్యపడుతున్నదెవరు ? ధైర్యంగా ఉండాల్సిందెవరు ? అనే విషయంలో పార్టీలో పెద్ద చర్చే జరుగుతోంది. ఎందుకంటే భయపడాల్సిన అవసరం ఎవరికైనా ఉందంటే చంద్రబాబు అండ్ కోకు మాత్రమే. ఇక్కడ చంద్రబాబు అండ్ కో అంటే అడ్డదిడ్డంగా దోచేసుకున్న మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపిలు, నేతలు మాత్రమే.

పార్టీలోని చాలామందికి పదవులు రాక, సంపాదన మార్గాలు లేక చంద్రబాబుపై మండిపోయారు. అందుకే మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు ముణిగిపోయింది. కాబట్టి విచారణలన్నా, దాడులన్నా అధికారాన్ని అడ్డం పెట్టుకుని రెచ్చిపోయిన కొంతమంది మాత్రమే భయపడాలి.

తనపై కేసులు పెడతారని, దాడులు జరుపుతారని, అరెస్టులు చేస్తారని ఎన్నోసార్లు ఆందోళనలు వ్యక్తం చేసిందే చంద్రబాబు. చేసిందంతా అడ్డదిడ్డమైన పనులు కాబట్టే చంద్రబాబు అంతలా భయపడుతున్నారు. అలాగే మరికొందరు కూడా భయపడుతున్నారు. అంతేకానీ పార్టీలో ఉన్న వాళ్ళందరిపైనా ఎవ్వరూ దాడులు చేయరు, కేసులు పెట్టి అరెస్టులూ చేయరు. అయినా చంద్రబాబు అందరూ ధైర్యంగా ఉండండని పదే పదే చెబుతున్నారంటే ఎంతగా భయపడుతున్నారో అర్ధమైపోతోంది.