జాతీయ పార్టీల నుండి ఆహ్వానమట

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాటలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఆడవాళ్ళ మాటలకు అర్ధాలే వేరులే అనే పాట పవన్ కల్యాణ్ కు కూడా బాగా వర్తిస్తుంది. ఎందుకంటే పవన్ చెప్పేదొకటి చేసేదొకటి అని చాలా సార్లే రుజువైంది. తానా సభల్లో పాల్గొనటానికి అమెరికా వెళ్ళొచ్చిన  పవన్ మొదటిసారి మీడియాతో మాట్లాడారు. తమతో కలిసి పనిచేయమని జాతీయ పార్టీల నుండి ఆహ్వానం వచ్చిందంటూ పవన్ చెప్పటం ఇందులో భాగమే.

నిజానికి పవన్ ను ఆహ్వానించిన  ఆ జాతీయ పార్టీ ఏదో మాత్రం చెప్పలేదు. మొన్నటి ఎన్నికలో బిఎస్పీతో కలిసే కదా పనిచేసింది ? మొన్న అమెరికా పర్యటనలో బిజెపి ఏపి ఇన్చార్జి రామ్ మాధవ్ తో చాలాసేపు పవన్ భేటీ అయ్యారు. బహుశా ఆ సమయంలో బిజెపిలో జనసేన విలీనం గురించి చర్చ జరుగుంటుంది. అందుకనే తిరిగి రాగానే పవన్ ఈ సొల్లు మాటలు మాట్లాడుతున్నారు.

మొన్నటి ఎన్నికల్లో 140 స్ధానాల్లో పోటీ చేసిన జనసేన గెలిచింది ఒక్కసీటులో మాత్రమే. రెండు చోట్ల పనిచేసిన పవన్ కూడా ఓడిపోయారు. అలాంటి జనసేనతో పొత్తు పెట్టుకోవటానికి ఏ జాతీయ పార్టీ మాత్రం ఆశక్తి చూపుతుంది ?  తనను ఆహ్వానించిన జాతీయ పార్టీ గురించి మాత్రం పవన్ చెప్పలేదు. దాంతోనే పవన్ ప్రకటనలోని డొల్లతనం తెలిసిపోతోంది.

కాకపోతే పవన్ తో కలిసేందుకు బిజెపికి మాత్రం అవకాశం ఉంది. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో ఏపిలో అధికారంలోకి వచ్చేస్తామని నోటికొచ్చినట్లు ప్రకటనలు చేస్తున్నారు నేతలు. అధికారంలోకి రాకపోయినా కొన్ని సీట్లు గెలవాలన్నా పవన్ లాంటి ప్రజాకర్షక నేతలు కావాలని బిజెపి కోరుకుంటోంది. అయితే అది పొత్తులా ? లెకపోతే జనసేనను బిజెపిలో విలీనం చేసుకుంటుందా ? అన్నది మాత్రం తేలలేదు. ఆ ముచ్చటను కూడా తొందరలోనే చూస్తాము లేండి.