ఒకరు కాదు ఇద్దరు కాదు తెలుగుదేశంపార్టీ తరపున వారసత్వ హోదాలో తొమ్మిది మంది మొన్నటి ఎన్నికల్లో మొదటిసారి పాల్గొన్నారు. మరి వారిలో గెలుపు అదృష్టం ఎవరిని వరిస్తుంది ? ఇపుడీ అంశమే పార్టీలో సస్పెన్స్ గా మారిపోయింది. మిగిలిన వాళ్ళ సంగతిని పక్కన పెట్టినా ఇద్దరి విషయంలో మాత్రం పార్టీ యావత్తు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఇంతకీ వారెవరో కాదు నారా లోకేష్, శ్రీ భరత్.
పార్టీ తరపున కర్నూలు జిల్లాలో ఇద్దరు వారసులు ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేశారు. పత్తికొండలో కెఇ కృష్ణమూర్తి కొడుకు కెఇ శ్యాంబాబు, కర్నూలులో టిజి వెంకటేష్ కొడుకు టిజి భరత్. ఇక అనంతపురం జిల్లాలో అనంతపురం ఎంపిగా జేసి దివాకర్ రెడ్డి కొడుకు జేసి పవన్ రెడ్డి, తాడిపత్రి ఎంఎల్ఏ కొడుకు జేసి ప్రభాకర్ రెడ్డి కొడుకు జేసి అస్మిత్ రెడ్డి రంగంలోకి దూకారు. పరిటాల సునీత వారసునిగా పరిటీల శ్రీరామ్ రంగంలోకి దూకారు.
శ్రీకాళహస్తిలో మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కొడుకు బొజ్జల సుధీర్ రెడ్డి కూడా పోటీ చేశారు. నారా లోకేష్ మంగళగిరిలోను, శ్రీ భరత్ విశాఖపట్నం ఎంపిగాను తొడకొట్టారు. మిగిలిన వాళ్ళకు లేని ప్రత్యేకతలు వీళ్ళద్దరికీ ఉంది. అదేమిటంటే నారా లోకేష్ ఎవరంటే ఠక్కున ఎవరైనా చెప్పేస్తారు చంద్రబాబునాయుడు కొడుకని. శ్రీ భరత్ ఎవరంటే లోకేష్ తోడల్లుడని, నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడని చెప్పేస్తారు.
చివరగా విజయనగరంలో అశోక్ గజపతిరాజు వారసురాలిగా అదితి కూడా రంగంలో ఉన్నారు. విచిత్రమేమిటంటే ప్రభుత్వంపై జనాల్లో విపరీతమైన వ్యతిరేకత ఉందనుకుంటున్న ఎన్నికల్లో పోటికి దిగారు. క్షేత్రస్ధాయి నుండి అందుతున్న సమాచారం ప్రకారమైతే వారసుల్లో ఎవరికి కూడా గెలుపు అవకాశాలు పెద్దగా లేవనే చెప్పాలి.
మంగళగిరిలో పోటీ చేసిన నారా లోకేష్ కు మామూలుగా అయితే గెలుపు కష్టమనే చెప్పాలి. ఎందుకంటే, వైసిపి తరపున పోటీ చేసిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్. జనాల్లో బాగా పాతుకుపోయిన నేత. అలాంటి చోట లోకేష్ గెలవటమంటే దొడ్డిదోవన చేసుకునే ప్రయత్నాలతో తప్ప సాధ్యంకాదు.
అలాగే, భరత్ కు టికెట్ ఇవ్వటమే చంద్రబాబుకు ఇష్టం లేదట. అయినా తప్పని పరిస్ధితుల్లో టికెట్ ఇవ్వాల్సొచ్చిందని సమాచారం. అందుకే ఇటు టికెట్ ఇచ్చినట్లే ఇచ్చి అటు జనసేన అభ్యర్ధి జేడి లక్ష్మీనారాయణ గెలుపుకు సహకరించమని పార్టీ క్యాడర్ కు పార్టీ నుండి ఆదేశాలు వచ్చాయని ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలో భరత్ గెలుపు డౌటనే చెప్పాలి. లోకేష్, భరత్ ఇద్దరూ ఓడినా నష్టం లేదు. టిడిపి ఓడి భరత్ గెలిస్తే కథ ఇంకో రకంగా ఉంటుంది. అలాకాదని లోకేష్, టిడిపి గెలిచి భరత్ గనుక ఓడితే మాత్రం….