జనసేనాని హఠాత్తుగా దేశ రాజధానికి పయనానికి కారణం రాష్ట్ర రాజధానినా ?

what is the main reason behind pawan kalyan delhi tour

ఈ రోజు హఠాత్తుగా పవన్ ఢిల్లీ పర్యటనకు వెళ్ళటం ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణలో ప్రాధాన్యతని సంతరించుకుంది . పవన్ కళ్యాణ్ వెంట ఆ పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ కూడా వెళ్ళారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా రేపు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పవన్ కళ్యాణ్ సమావేశం అవుతారని జనసేన పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీలో బీజేపీ జాతీయ నాయకులను కలవనున్న జనసేన అధినేత… హైదరాబాద్ ఎన్నికల గురించి చర్చించే అవకాశం ఉంది.

what is the main reason behind pawan kalyan delhi tour
what is the main reason behind pawan kalyan delhi tour?

ఇటీవల ఆయన ఏపీలో పర్యటనలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనల సందర్భంగా ఆయన అమరావతి ప్రాంత రైతులతో సమావేశం అయ్యారు. స్వయంగా ఆయన వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు అన్ని విధాలుగా జనసేన పార్టీ అండగా ఉంటుంది అని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. అమరావతి రైతులతో భేటీ అయిన పవన్ కల్యాణ‌్ వారికి మోడీతో అపాయింట్ మెంట్ ఇప్పిస్తానని చెప్పారు. ఈ విషయాన్ని కూడా కేంద్ర నాయకులతో పవన్ కల్యాణ్ చర్చించనున్నట్లు తెలిసింది. ఈ తరుణంలో ఆయన ఢిల్లీ వెళ్ళడంతో అసలు ఎందుకు ఏంటీ అనేది ఆసక్తిగా ఉంది.