జోగయ్యగారి ధైర్యం ఏమిటి పవన్?

పవన్ గురించి పవన్ కంటే తనకే ఎక్కువ తెలుసు అనుకుంటున్నారో.. లేక, పవన్ శక్తిసామర్ధ్యాలపై మితిమీరిన నమ్మకాన్ని కలిగి ఉన్నారో తెలియదు కానీ… పవన్ పై హరిరామజోగయ్య బీభత్సమైన కామెంట్లు చేస్తున్నారు. మితిమీరిన నమ్మకాన్ని కనబరుస్తున్నారు. ఫలితంగా జనసైనికులను టెన్షన్ లో పెట్టేస్తున్నారు.

కాపు సీనియర్ నేత, మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య… జనసేన అధినేత పవన్ ను ఒంటరిగా ఎన్నికల్లో పోటీచేయమని మరోసారి నొక్కి వక్కానిస్తున్నారు. అవును… అయితే బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్లాలి… అలాకాని పక్షంలో ఒంటరిగానే పోటీ చేయాలి… అలా చేస్తే జనసేన అధికారంలోకి రావటం ఖాయం అని చెబుతున్నారు జోగయ్య.

జోగయ్య గారి జోస్యం అలా ఉంటే… వాస్తవం ఎలా ఉందో ఇప్పుడుచూద్దాం! గడిచిన ఎన్నికల్లో జనసేన ఒక సీటు గెలిచింది.. పవన్ ఒకటి కూడా గెలవలేదు. తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్కడక్కడా కాస్త ప్రభావం చూపించగలిగినా… దాన్ని ఎమ్మెల్సీ ఎన్నికల్లో కంటిన్యూ చేయడంలో పరిపూర్ణంగా విఫలమయ్యరు.

పోనీ… మిత్రపక్షం బీజేపీకైనా మద్దతిచ్చి.. వారిని గెలిపించినా.. అది జనసేన సక్సెస్ గానే చెప్పుకోవచ్చు. కానీ… వీటిలో ఏపనీ ఇప్పటివరకూ పవన్ చేయలేదు. డైరెక్ట్ గా ఫైనల్స్ ఆడేద్దామని సిద్ధపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీతో పొత్తు పెట్టుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫిక్సయిపోయినట్లే కనిపిస్తున్నారు.

ఈ విషయాన్ని ఇప్పటికే రెండు బహిరంగసభల్లో ఆలో మోస్ట్ కన్ ఫాం అన్నట్లు ప్రకటించారు కూడా. అయితే పవన్ వైపునుండి పొత్తు ప్రతిపాదన బహిరంగంగా ఎన్నిసార్లు వచ్చినా… వ్యూహాత్మక మౌనంలో భాగంగానో ఏమో కానీ… చంద్రబాబు మాత్రం బయటపడడం లేదు. అయితే… అప్పుడే తొందరపడకూడదనే బాబు సీనియారిటీ ఇందుకు కారణం కావొచ్చు! బయటనుంచి చూసేవారికి మాత్రం… పొత్తులకోసం పవన్ వెంపర్లాడుతున్నట్లు – బాబు మాత్రం లైట్ తీసుకుంటున్నట్లు కనిపిస్తుంటుంది.

పరిస్థితులు ఇలా ఉంటే… పవన్ ఆలోచనలు అలా ఉంటే… వాస్తవాలు ఇంత క్లియర్ గా ఉంటే… తన అభిమానులే తనకు ఓట్లేయలేదని, కాపులు ఓట్లేసినా తాను భీమవరం-గాజువాకలో గెలిచుండేవాడినని ఇప్పటికీ పవన్ మొత్తుకుంటుంటే… ఒంటరిగా వెళ్తే వీరమరణమే అని బెదురుతుంటే… జోగయ్య మాత్రం… ఒంటరిగా పోటీచేయాలని సూచిస్తున్నారు.

దీంతో… దశాబ్ధాల అనుభవం ఉన్న జోగయ్య కూడా గ్రౌండ్ రియాలిటిని తెలుసుకోకుండా పవన్ కు ఇలాంటి సలహాలు ఇస్తున్నారేంటబ్బా అని కామెంట్లు పెడుతున్నరు జనసైనికులు!